ఇకపై ఉద్యోగాలన్నీ మా పౌరులకే: సౌదీఅరేబియా
- May 17, 2017
చమురేతర ఆదాయాన్ని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్న సౌదీ అరేబియా... దేశ పౌరుల్లో నిరుద్యోగాన్ని కూడా పారద్రోలాలని ప్రణాళికలు రచిస్తోంది. దీనిలో భాగంగా దేశంలోని కొన్ని రంగాల్లో కేవలం తమ పౌరులకు మాత్రమే ఉద్యోగాలివ్వాలని అధికారులకు అదేశాలు జారీ చేసింది. మోటార్ ఇన్సూరెన్స్ సెక్టార్‌లోని వెహికిల్ క్లెయిమ్ అడ్మినిస్ట్రేషన్‌కు సంబంధించిన ఉద్యోగాలన్నింటిలోనూ సౌదీ పౌరులను నియమించాలంటూ ప్రభుత్వం ఆదేశించింది. దీనిలో భాగంగా దేశంలోని అన్ని బ్రాంచులకు సౌదీ అరేబియన్ మానిటరీ అథారిటీ ఉత్తర్వులు పంపింది. ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, రికవరీ, సర్వేయర్స్, కస్టమర్ కేర్స్, ఫిర్యాదులు వంటి వెహికిల్ ఇన్సూరెన్స్‌లోని ఉద్యోగాలను సౌదీ పౌరులతో భర్తీ చేయనున్నారు. జూలై రెండు నుంచి ఈ ఆదేశాలను అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది.
తాజా వార్తలు
- రైళ్లలో అదనపు లగేజీ పై ఛార్జీలు
- విశాఖ వేదికగా జాతీయ టూరిజం మార్ట్..
- దుబాయ్‌లో బహ్రెయిన్ ప్రయాణికులకు అరుదైన స్వాగతం..!!
- హ్యాకింగ్, ఆర్థిక మోసాల దారితీసే నకిలీ QR కోడ్లు..!!
- కువైట్ లో పాదచారుల భద్రతకు ప్రతిపాదనలు..!!
- ఖతార్ లోఆరోగ్య కేంద్రాల పనివేళలల్లో మార్పులు..!!
- సౌదీలో కార్మికుల పై ప్రవాస రుసుము రద్దు..!!
- ఒమన్, భారత్ మధ్య కీలక అవగాహన ఒప్పందాలు..!!
- ఐఫోన్ ఎగుమతుల్లో చరిత్ర సృష్టించిన భారత్
- మస్కట్ చేరుకున్న ప్రధాని మోదీ







