22న మొదలుకానున్న కొరటాల- మహేష్ ల సినిమా
- May 17, 2017
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం మురుగదాస్ దర్శకత్వంలో స్పైడర్ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇక కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ తన 24వ సినిమా చేయనున్నాడు. ఈ సినిమాకి భరత్ అనే నేను అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రిన్స్ కి శ్రీమంతుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన కొరటాల ,ఈ చిత్రాన్ని కూడా చాలా రిచ్ గా తెరకెక్కించాలనే ప్లాన్ అన్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ చిత్రాన్ని మే 22న సెట్స్ పైకి తీసుకెళ్ళనుంది. హైదరాబాద్ లోనే కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరపనున్నారు. ఈ చిత్రంలో మహేష్ బాబు పొలిటీషన్ గా కనిపించనున్నట్టు సమాచారం. దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడు.
తాజా వార్తలు
- రవీంద్ర భారతిలో ఎస్పీ బాలు విగ్రహావిష్కరణ..పాల్గొన్న ప్రముఖులు
- IPL మినీ ఆక్షన్లో కొత్త రూల్...
- జోర్డాన్ చేరుకున్న ప్రధాని మోదీ..
- కోఠి ఉమెన్స్ కాలేజీలో వేధింపులు..
- 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తా: కవిత
- శ్రీమతి ఆంధ్రప్రదేశ్ 2025గా హేమలత రెడ్డి ఎంపిక…
- రవీంద్రభారతిలో ఎస్పీబాలు విగ్రహావిష్కరణ
- న్యూ ఇయర్ వేడుకలకు సీపీ సజ్జనార్ కీలక మార్గదర్శకాలు
- తామ్కీన్, SIO ఫ్రాడ్ కేసులో 10 ఏళ్ల జైలుశిక్షలు..!!
- సకాన్ హౌజింగ్ యూనిట్ల కేటాయింపు ప్రారంభం..!!







