తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అభినందించారు: హీరో శర్వానంద్

- May 18, 2017 , by Maagulf
తెలంగాణ సీఎం కేసీఆర్ గారు అభినందించారు: హీరో శర్వానంద్

 'శతమానం భవతి' టీమ్‌ను సీఎం కేసీఆర్ అభినందించారని హీరో శర్వానంద్ తన ఫేస్‌బుక్ పేజ్‌లో పేర్కొన్నాడు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమాలైన శతమానం భవతి, పెళ్లి చూపులు చిత్రాలకు అవార్డులు వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శతమానం భవతి టీమ్‌ను సీఎం కేసీఆర్ తన క్యాంపు కార్యాలయంలో అభినందించారు. మంచి చిత్రాన్ని నిర్మించిన నిర్మాత దిల్ రాజుకు ప్రశంసా పత్రాన్ని, జ్ఞాపికను అందేశారు. ఈ కార్యక్రమంలో హీరో శర్వానంద్‌తో పాటు పలువురు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com