భారత్, పాకిస్తాన్ జాతీయులకు ఇళ్లను అద్దెకివ్వను
- May 18, 2017
భారత్, పాకిస్తాన్ జాతీయులకు తన ఇళ్లను అద్దెకు ఇవ్వనని బ్రిటిష్ సంపన్నుడు ఫెర్గూస్ విల్సన్ చెబుతున్నాడు. దీనిపై వివాదం రేగినా, న్యాయపర చర్యలు తీసుకునే అవకాశమున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ‘వారు ఇళ్లు ఖాళీ చేశాక భారతీయ వంటకాల వాసన వస్తుంది. మళ్లీ కార్పెట్లు వేయడానికి ఖర్చవుతుంది..అందుకే వారికి ఇళ్లను అద్దెకు ఇవ్వను. ఇది వారి శరీర వర్ణానికి సంబంధించిన సమస్య కాదు, కూర(కర్రీ)కు సంబంధించిన సమస్య..’ అని వాదిస్తున్నాడు.
వెయ్యికిపైగా ఇళ్లున్న ఫెర్గూస్ భారతీయులపై విధించిన ఈ నిషేధాన్ని బ్రిటన్ మానవ హక్కుల సంస్థ ఈక్వాలిటీ అండ్ హ్యూమన్ రైట్స్ కమిషన్(ఈహెచ్‌ఆర్‌సీ) కోర్టులో సవాలు చేసింది. విల్సన్ నిర్ణయాన్ని నిలిపేస్తూ ఆదేశాలివ్వాలని సెంట్రల్ లండన్ కౌంటీ కోర్టును కోరామని సంస్థ ప్రతినిధి రెబెక్కా హిల్సెన్‌రథ్ తెలిపారు. భారత్, పాక్ జాతీయులకు ఇళ్లను కిరాయి ఇవ్వొద్దంటూ ఫెర్గూస్ తన ఏజెంట్లకు పంపిన ఈమెయిల్స్ లీక్ కావడంతో వివాదం రేగింది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







