హైదరాబాద్ మక్కామసీద్‌లో పేలుళ్ల ఘటనకు నేటితో 10 ఏళ్లు
- May 18, 2017
చార్మినార్ మక్కామసీద్‌లో పేలుళ్లు జరిగి ఇవాళ్టికి పదేళ్లయ్యింది. ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా పాతబస్తీ అంతటా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభలు, ర్యాలీలకు అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. అదనపు బలగాల్ని కూడా సిద్ధంగా ఉంచారు. అడిషనల్ సీపీ స్వాతి లక్రా ఆధ్వర్యంలో ఐదుగురు డీసీపీలు, ఐదుగురు ఏసీపీలు, 50 మంది సీఐలు, 100 మంది ఎస్సైలు, 2 కంపెనీల ఆర్ఏఎఫ్ బలగాలు భద్రతను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నాయి. పాతబస్తీలోని సున్నితమైన ప్రాంతాల్లో వాహనాల తనిఖీ కూడా చేపట్టారు. 2007లో మక్కామసీద్‌లో బాంబు పేలుళ్లు జరిగి 9 మంది మృతి చెందారు. 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనకు పదేళ్లైన నేపథ్యంలోనే ఓల్డ్ సిటీలో హైఎలర్ట్ ప్రకటించారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







