భిక్షాటన చేపట్టిన స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులు
- May 18, 2017
ఉపాధి కల్పించాలని కోరుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్ నిర్వాసితులు గురువారం జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద భిక్షాటన చేపట్టారు. విశాఖ ఉక్కు నిర్వాసిత ఐక్య సంఘం, విశాఖ ఉక్కు నిర్వాసిత కాంట్రాక్టు లేబర్ యూనియన్ ఆధ్వర్యాన చేపట్టిన కార్యక్రమంలో నిర్వాసితులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెండు సంఘాల ప్రధాన కార్యదర్శులు ఉమ్మడి అప్పారావు, దుగ్గపు అప్పలరాజు మాట్లాడారు. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం జరిగితే 60 వేల మంది నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పిస్తామని నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించారని చెప్పారు. ఈ క్రమంలో 17 వేల మందికి ఆర్.కార్డులు ఇచ్చారని, వారిలో కొందరికే ఉద్యోగాలు కల్పించారని తెలిపారు. ఆర్.కార్డులున్న వారందరికీ ఉద్యోగాలు కల్పించాలని, లేకుంటే ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!







