బాహుబలి 2 విజయం తో అమెరికా లో ఎంజాయ్ చేస్తున్న
- May 18, 2017
'బహుబలి' తో నేషనల్ స్టార్ గా మారిపోయిన ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో 'బాహుబలి 2' సక్సస్ ను ఎంజాయ్ చేస్తూ రోజులు గడుపుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం నేషనల్ మీడియాకు హాట్ టాపిక్ గా మారిన ప్రభాస్ గురించి వార్తలు ప్రచురించకుండా ఒక్కరోజు కూడ గడవటం లేదు అంటే ప్రభాస్ రేంజ్ ఏస్థాయిలో ఉందో అర్ధం అవుతుంది.
ప్రభాస్, రాజమౌళి పడ్డ కష్టానికి ఇండియన్ సినీ ప్రేక్షకులు ఊహించని ఫలితం అందించడంతో ఈ మూవీ కలక్షన్స్ ఊహకందని స్థాయిలో పరుగులు తీస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు 'బాహుబలి' ప్రాజక్ట్ కోసం అన్నీ వదులుకుని కష్టపడ్డ ప్రభాస్ ప్రస్తుతం అమెరికాలో రిలాక్స్ అవుతున్నాడు.
'
బాహుబలి 2' షూటింగ్ పూర్తి అయిపోయిన వెంటనే ప్రభాస్ యూఎస్ఏ వెళ్లి కొన్ని రోజులు రిలాక్స్ అవ్వాలని ఫిక్స్ అయ్యాడు. అందుకు తగిన విధంగా ముందే ప్లాన్ చేసుకున్నాడు. వాస్తవానికి సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ప్రభాస్ యూఎస్ఏ ట్రిప్ ప్లాన్ చేసుకున్నాడు. అయితే రాజమౌళి సినిమా ప్రమోషన్స్ పూర్తయ్యే వరకు వెళ్లకుండా అడ్డుకోవడంతో ప్రభాస్ అమెరికా ట్రిప్ ఆలస్యం అయింది.
తెలుస్తున్న సమాచారం మేరకు అమెరికాలో ప్రభాస్ ఎక్కువగా ప్రైవేట్ ప్లేసుల్లోనే గడుపుతున్నట్లు సమాచారం. బాహుబలి తర్వాత ప్రభాస్ ఇంటర్నేషనల్ స్టార్ అయిపోవడంతో అమెరికాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతాలలో ప్రభాస్ ఎక్కడ కనిపించినా అతడిని జనం గుర్తుపడుతున్న పరిస్థుతులలో ప్రభాస్ ఇలా ఎక్కువగా జనం లేని ప్రయివేట్ ప్లేస్ లలో తన రెస్ట్ ను కొనసాగిస్తున్నట్లు టాక్.
త్వరలోనే 'సాహో' షెడ్యూల్ అమెరికాలో మొదలు కానున్న నేపథ్యంలో ప్రభాస్ నుండి క్లియరెన్స్ వచ్చాక వచ్చేనెల నుంచి అక్కడ 'సాహో' షూటింగ్ ప్రారంభం అయ్యే ఆస్కారం ఉంది అని అంటున్నారు. ఇండియన్ మీడియాకు సెలెబ్రెటీగా మారిపోయిన ప్రభాస్ 'బాహుబలి' పుణ్యమా అని అమెరికాలో అజ్ఞాత జీవితాన్ని ఎంచుకున్నాడు అనుకోవాలి..
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









