జీఎస్టీతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయ్
- May 19, 2017
జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) అమలుతో నిత్యావసర వస్తువుల ధరలు తగ్గనున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటన చేసింది. దాదాపు 1211 వస్తువుల్లో ఆరు మినహా మిగతా వాటన్నింటికీ జీఎస్టీ ధరలను నిర్ణయించినట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీ వెల్లడించారు. జీఎస్టీ పన్ను విధానం నుంచి పాలు, పప్పుధాన్యాలకు పన్ను మినహాయించారు. పంచదార, టీపొడి, కాఫీ పొడి, వంటనూనెపై 5శాతం పన్ను విధించనున్నారు. హెయిర్ ఆయిల్, సబ్బులు, టూత్‌పేస్టుల ధరలు పెరగనున్నాయి. మొత్తంగా.. జీఎస్టీ అమలుతో సామాన్యుడికి మేలు జరగనుంది.
స్వాతంత్య్రానంతర భారతదేశంలో చేపట్టిన అతిపెద్ద ఆర్థిక సంస్కరణ ఇది. 2006లో ఆర్థికమంత్రి హోదాలో చిదంబరం ప్రతిపాదించిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం ఎన్డీయే హయాంలో అములులోనికి రానుంది. దేశంలోని 29 రాష్ర్టాల్లో కనీసం సగం రాష్ర్టాల శాసనసభలైనా ఈ బిల్లుపై అంగీకారముద్ర వేయటం తప్పనిసరి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు జీఎస్టీ బిల్లుకు ఆమోదం తెలిపాయి.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







