సెమీస్‌లో సానియా మీర్జా జోడీ

- May 19, 2017 , by Maagulf
సెమీస్‌లో సానియా మీర్జా జోడీ

భారత స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌, తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌ సానియా మీర్జా సీజన్‌లో మరో టైటిల్‌ దిశగా దూసుకెళ్తోంది. నూతన భాగస్వామి యరస్లోవ ష్వెడొవా (ఖజకిస్థాన్‌)తో కలిసి మహిళల డబుల్స్‌లో సెమీ ఫైనల్లో ప్రవేశించింది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో ఇటలీ జోడీ సారా ఎరానీ, మటియె ట్రెవిసన్‌పై వరుస సెట్లలో గెలుపొందారు. సానియా జోడీ ఆధిపత్యం నడి చిన పోరులో 6-4, 6-1తో ఏకపక్ష విజయం సొంతమైంది. నేడు జరిగే సెమీఫైనల్లో మాజీ భాగస్వామి, స్విస్‌ స్టార్‌ మార్టినా హింగిస్‌, చన్‌ యంగ్‌ జన్‌ (చైనా) జోడీతో మూడో సీడ్‌ సానియా, యరస్లోవా తలపడనున్న ది. అంత కముందు ప్రీ క్వార్టర్స్‌లో ఉక్రెయిన్‌ అమ్మాయిలు వాకోవర్‌ ఇవ్వటంతో సానియా జోడీ నేరుగా క్వార్టర్స్‌కు చేరుకున్నది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com