కొరియా ద్వీపకల్ప తీరానికి మరో విమాన వాహకనౌక
- May 19, 2017
కొరియా ద్వీపకల్ప తీరానికి మరో విమాన వాహకనౌక యుఎస్‌ఎస్ రోనాల్డ్ రీగన్‌ను తరలించేందుకు అమెరికా నౌకాదళం సిద్ధమయింది. ఈ నౌక ఇప్పటికే కొరియా తీరంలో మకాం చేసిన యుఎస్‌ఎస్ కార్ల్ విన్సన్ నౌకతో కలిసి సైనిక విన్యాసాలు కొనసాగి స్తుందని అమెరికా రక్షణశాఖ అధికారులు వెల్లడించారు. జపాన్‌లోని యొకోసుకా రేవులో మరమ్మతు నిర్వహణా పనులను, సముద్రపు ట్రయల్స్‌ను పూర్తి చేసుకున్న ఈ నౌక మంగళవారం నాడు కొరియా తీరానికి బయల్దేరిం దని రియర్ అడ్మిరల్ ఛార్లెస్ విలియమ్స్ వివరించారు.
విస్తృత స్థాయిలో విన్యాసాలు
కొరియా తీరానికి చేరుకున్న తరువాత ఈ నౌక విస్తృత స్థాయిలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తుందని, అయితే ప్రాథమికంగా యుద్ధ విమానాల టేకాఫ్, లాండింగ్ వంటి అంశాల విషయంలో నౌక సామర్ధ్యాన్ని పరీక్షిస్తారని ఈ ప్రకటనలో వివరించారు. 1,092 అడుగుల పొడవున్న రీగన్ నౌకలో 4,539 మంది సిబ్బందితో పాటు 60 యుద్ధ విమానాలు వుంటాయని నౌకాదళ అధికారులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







