బిహార్ రాజధాని పట్నామాల్లో అగ్నిప్రమాదం: 30షాపులు దగ్ధం
- May 20, 2017
బిహార్ రాజధాని పట్నాలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.బోరింగ్ రోడ్‌లోని జీవీ మాల్లో శనివారం తెల్లవారుజామున ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. గ్రౌండ్‌ఫ్లోర్ నుంచి చెలరేగిన మంటలు కొద్ది సేపటికే మాల్లోని అయిదు అంతస్థులకు వ్యాపించాయి.దీంతో మాల్లోని మొత్తం 30 దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయి. స్థానికుల సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపుచేశారు.
మంటలు చెలరేగిన మాల్ చుట్టుపక్కల ఓ పెట్రోల్‌బంక్, హిందీ ప్రింట్ మీడియా హెడ్‌క్వార్టర్స్, రెసిడెన్షియల్ భవనం, ఎలక్ట్రానిక్ వస్తువుల షోరూం ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకుని మంటలను అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది. మాల్లో కోచింగ్ సెంటర్, రెస్టారెంట్, మరికొన్ని రిటైల్ దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని దుకాణాలు పూర్తిగా దగ్ధమయ్యాయని, నష్టం రూ.కోట్లలో ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. అయితే అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్నది మాత్రం స్పష్టత రాలేదు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







