సోషల్ మీడియా డొనేషన్ ప్రకటనలపై హెచ్చరిక
- May 20, 2017
సోషల్ మీడియా ద్వారా డొనేషన్ల కోసం ఎవరైనా ఎలాంటి ఫేక్ ప్రకటనలు ఇచ్చినా అది నేరం కింద పరిగణిస్తామని దుబాయ్ పోలీస్ సీనియర్ అధికారి చెప్పారు. ఈ మధ్యకాలంలో ఈ తరహా ఫేక్ ప్రకటనలతో చాలామంది మోసపోతున్నట్లు దుబాయ్ పోలీస్ చీఫ్ ఆఫ్ క్రిమినల్ ఇన్వెస్టిగేషన్స్ ఎఫైర్స్ అసిస్టెంట్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీమ్ అల్ మన్సౌరి చెప్పారు. 50,000 దిర్హామ్‌లు డొనేషన్ చేయడానికి సిద్ధంగా ఉన్నామనీ, జైల్లో ఉండి ఆర్థిక సమస్యలతో అందులోంచి బయటకు రాలేకపోతున్నవారికి సహాయం చేస్తామని కొందరు ఫేక్ మెసేజ్‌లను ప్రచారంలోకి తీసుకువచ్చారనీ, వాటికి ఆకర్షితురాలైన ఓ మహిళ తన భర్త కోసం వారిని ఆశ్రయించి మోసపోయిందని ఆయన వివరించారు. ఇలాంటి మెసేజ్‌లు ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే పోలీసులను సంప్రదించాలని కోరారాయన. ఎప్పటికప్పుడు దుబాయ్ పోలీస్, ఈ తరహా మెసేజ్‌లపై నిఘాపెట్టి, అక్రమార్కులపై ఉక్కుపాదం మోపేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
తాజా వార్తలు
- మత్స్యకారుల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: ఎంపీ బాలశౌరి
- కాలేజీ విద్యార్థులకు హెచ్ఐవీ..స్పందించిన కర్ణాటక సొసైటీ..!
- రసాయన ఎరువుల దిగుమతులకు ప్రత్యామ్నాయ వనరులపై కేంద్రం కీలక చర్యలు: ఎంపీ బాలశౌరి
- ఫైనల్ కు ఐదుగురు భారత బాక్సర్లు
- దుబాయ్ JLTలో కొత్త ఎలక్ట్రిక్ బస్ సర్వీస్..!!
- కువైట్‌లో 5% పెరిగిన వినియోగదారుల ఖర్చులు..!!
- దుబాయ్‌లో డ్రైవర్‌కు జైలుశిక్ష, జరిమానా, లైసెన్స్ సస్పెన్షన్..!!
- ఖతార్ లో ఆగస్టులోనూ హాట్, హ్యుమిడ్ వెదర్..!!
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!







