ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ నిరాహార దీక్ష

- October 08, 2015 , by Maagulf
ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోసం వైఎస్‌ జగన్‌ నిరాహార దీక్ష

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. గుంటూరు నల్లపాడు రోడ్‌లోని ఓ ప్రైవేటు స్థలంలో ఈ దీక్షను కొనసాగిస్తున్నారు. జగన్‌కు సంఘీభావం తెలిపేందుకు వివిధ వర్గాలకు చెందిన ప్రజలు దీక్షాస్థలికి చేరుకుని మాటామంతీ చేస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం అన్ని జిల్లాల్లోనూ పెద్దయెత్తున నిరసన దీక్షలు చేపట్టాలని పార్టీ యంత్రాంగానికి వైకాపా నేతలు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. హోదాపై కేంద్రం స్పష్టమైన ప్రకటన వచ్చేంత వరకు పెద్ద ఎత్తున పోరాటాలు చేయాలని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com