ప్రధాని నరేంద్ర మోదీ హత్యకు భారీ కుట్ర
- May 23, 2017
‘భారత ప్రధాని నరేంద్ర మోదీని అంతం చేయడానికి పథకం రెడీగా ఉంది. త్వరలోనే ఆయన ముంబైలో ఓ ర్యాలీలో పాల్గొంటారు.. అదనుచూసి దాడిచేద్దాం..’ అంటూ ఓ అగంతకుడు చేసిన ఫోన్‌కాల్ కలకలం రేపుతోంది. తాను పాకిస్థాన్ నుంచి మాట్లాడుతున్నానని, మోదీ హత్యకు సహకరిస్తే రూ.50కోట్లు ఇస్తానని ఆగంతకుడు చెప్పాడు. అసలేం జరిగిందంటే..
మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లా కేంద్రానికి చెందిన కుషాల్ సోనీకి ఇటీవలే +79651219 నంబర్ నుంచి కాల్ వచ్చింది. తననుతాను పాకిస్థానీగా పరిచయం చేసుకున్న అగంతకుడు.. మోదీని హత్యకు సహకరించాలని కుషాల్‌ను అడిగాడు. కంగారుపడుతూనే కాల్‌ను రికార్డ్ చేసిన కుషాల్.. నేరుగా పోలీసుల దగ్గరికి వెళ్లాడు. ఈ వ్యవహారంపై సాత్నా జిల్లా ఎస్పీ మిత్‌లేశ్‌కుమార్ స్పందించారు. కుషాల్ అందించిన నంబర్‌ను పరిశీలించామని, అయితే అది పాకస్థాన్‌నుంచి వచ్చిందికాదని, కజకిస్థాన్ నుంచి వచ్చిందని చెప్పారు. కాల్ రికార్డింగ్‌ను పరిశీలిస్తున్నామన్న ఆయన.. ఇది ఆకతాయిలపనా? లేక మరొకటా అనేదానిపై విచారణ చేపట్టామని పేర్కొన్నారు.
తాజా వార్తలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!
- కువైట్‌లో అపార్ట్మెంట్లో అగ్నిప్రమాదం.. ఇద్దరికి గాయాలు..!!
- ఖతార్‌లో ఉరుములు, మెరుపులతో వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక..!!
- ఒమన్‌లోని మస్కట్ పెట్రోల్ బంకుల్లో విస్తృత తనిఖీలు..!!
- విద్యార్థులపై దాడి.. ఉపాధ్యాయుడికి రెండేళ్ల జైలు శిక్ష, దేశ బహిష్కరణ
- వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్..
- జార్జియాలోని సిక్స్ ఫ్లాగ్స్ రోలర్ కోస్టర్ ప్రమాదంలో ఒకరు మృతి, పలువురికి గాయాలు







