‘మాంచెస్టర్’ మారణహోమం కేసులో నలుగురి అరెస్ట్
- May 24, 2017
► మారణహోమం ఘటనలో 119కి పెరిగిన క్షతగాత్రులు
► మరిన్ని దాడులు జరగొచ్చని నిఘా వర్గాల అనుమానం
మాంచెస్టర్ మారణహోమం కేసులో మరో నలుగురిని బ్రిటన్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టయిన వారి మొత్తం సంఖ్య ఐదుకు చేరింది. పాప్ సింగర్ అరియానా గ్రాండే సోమవారం మాంచెస్టర్లో సంగీత విభావరి నిర్వహిస్తుండగా సల్మాన్ అబేదీ అనే 22 ఏళ్ల ఉగ్రవాది అమర్చిన బాంబులు పేలి 22 మంది మరణించడం తెలిసిందే. ఈ దాడిలో గాయపడిన వారి సంఖ్య 59 నుంచి 119కి పెరిగింది. బుధవారం దక్షిణ మాంచెస్టర్లో ముగ్గురినీ, అక్కడికి దగ్గర్లోనే మరొకరిని పోలీసులు అరెస్టు చేశారు.
మంగళవారం అరెస్టైన ఇస్మాయిల్ అబేదీ, ఉగ్రవాది సల్మాన్ అబేదీకి అన్న అని పోలీసులు నిర్ధారించారు. సల్మాన్, ఇస్మాయిల్ల తల్లిదండ్రులది లిబియా కాగా వీరు బ్రిటన్లోనే పుట్టి పెరిగారు. ఇటీవల పలుసార్లు లిబియా, సిరియాలకు వెళ్లి వచ్చాక ఉగ్రవాదులుగా మారారని బ్రిటన్ అధికారులు తెలిపారు. దాడి అనంతరం సల్మాన్ సిరియాకు వెళ్లిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మాంచెస్టర్ పేలుళ్లతో పలువురు ఇతరులకు కూడా సంబంధం ఉందనీ, సల్మాన్ ఒక్కడే ఈ దాడి చేసి ఉండడని పోలీసులు, బ్రిటన్ హోంమంత్రి చెప్పారు. ఉగ్రవాదులను పట్టుకునేందుకు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాగా, బ్రిటన్లో మరిన్ని ఉగ్రదాడులు జరగొచ్చని నిఘా సమాచారం రావడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేపట్టారు.
తాజా వార్తలు
- ఫిలిం,టెలివిజన్ హబ్ గా ఏపీ: మంత్రి దుర్గేష్
- అమెరికా చర్యకు పశ్చాత్తాపం తప్పదు: ఇరాన్ విదేశాంగ మంత్రి హెచ్చరిక
- అమెరికా నెక్స్ట్ టార్గెట్ ఈక్వెడార్..ప్రారంభమైన దాడులు
- సెమీస్ పరీక్షకు సిద్ధమైన భారత్..!
- ఖమేనీ అంత్యక్రియల వాయిదా
- తెలంగాణ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
- బహ్రెయిన్ పై మిస్సైళ్లతో విచుచుకుపడ్డ ఇరాన్..అడ్డుకున్న రక్షణ వ్యవస్థలు..!!
- QR1 మిలియన్ జరిమానా, కంపెనీ సీజ్:ఖతార్
- భారతీయులకు వీసా సరళీకరణను ప్రకటించిన ఒమన్..!!
- యూఏఈ, జీసీసీ దేశాల అత్యవసర సమావేశం..ఉమ్మడి కార్యాచరణపై సమీక్ష..!!









