రాశి సిమెంట్ యజమాని మనవరాలితో హీరో ప్రభాస్ పెళ్లి

- May 24, 2017 , by Maagulf
రాశి సిమెంట్ యజమాని మనవరాలితో హీరో ప్రభాస్ పెళ్లి

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడు. అమ్మాయి రాశి సిమెంట్ యజమాని రాజుగారి మనవరాలు. రాశి సిమెంట్ ను మిర్యాలగూడలో పెట్టేందుకు కారణం బివిరాజుగారు. ఆయన కుటుంబం అంటే ఎంతో గౌరవమంటున్నారు ఇరువైపు పెళ్లి పెద్దలు. ఇప్పటికే కట్నకానుకల సంగతి మాట్లాడుకున్నారని తెలుస్తోంది. బాహుబలి సినిమా షూటింగ్ కోసం ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఆగిన ప్రభాస్ ఇప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. వచ్చే నవంబర్ లోనే పెళ్లి జరుగుతుందని వారి సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. ఇరువురి పేరు బలం చూపించి నిశ్చితార్థ ముహూర్తం పెట్టించేందుకు పెద్దలు సిద్దమవుతున్నారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన సమాచారం చెబుతామంటున్నారు రెబల్ స్టార్ సన్నిహితులు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ బ్యాచిలర్ హీరో ప్రభాస్ కావడంతో అతన్ని కాపాడటం కష్టమైపోతుందట.మిర్చి సినిమాలో తల్లి పాత్ర పోషించిన నదియా హీరోను అమ్మాయిల నుంచి కాపాడేందుకు చాలా తిప్పలు పడాల్సి వచ్చింది. అలా నిజ జీవితంలోను అమ్మాయిలు ప్రభాస్ వెంట పడుతున్నారట. వారి బారి నుంచి ప్రభాస్ ను కాపాడాలంటే..పెళ్లి చేయక తప్పదని పెద్దలు నిశ్చయించారు.అందుకే ఇప్పుడు ప్రభాస్ ముహుర్తానికి వేచి చూస్తున్నారు.      

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com