సూపర్ స్టార్ కి బీజేపీ బంపర్ ఆఫర్

- May 25, 2017 , by Maagulf
సూపర్ స్టార్ కి బీజేపీ బంపర్ ఆఫర్

సూపర్ స్టార్ రజినీకాంత్ పొలిటికల్ ఎంట్రీపై సర్వత్రా చర్చ నడుస్తోంది. రాజకీయాల్లోకి రావాలని కొందరు..రావొద్దని మరికొందరు తమిళనాడులో ఆందోళన చేస్తుండటంతో హాట్ టాపిక్కయ్యింది. తలైవా బీజేపీలో చేరబోతున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే మంచిదేనని..బీజేపీలో చేరితే మరింత ఆనందమని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ అన్నారు. 
తమిళనాడులో రాజకీయ సందిగ్ధత ఉన్నప్పుడు రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనుకోవడం మంచి నిర్ణయమని అభిప్రాయపడ్డారు. రజినీకి విశేష ప్రజాధరణ ఉందని..బీజేపీలో చేరితో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించడంలో అనుమానమే లేదని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. అయితే అంతిమ నిర్ణయం పార్టీ తీసుకుంటుందని చెప్పుకొచ్చారు. 

రజనీకాంత్ బీజేపీలో చేరకుండా వీసీకే నేత తిరుమావళన్ కుల రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి పొన్ రాధాకృష్ణన్ మండిపడ్డారు. దేశవ్యాప్తంగా అన్ని కులాలు, మతాలకు చెందినవారు భారతీయ జనతా పార్టీలో ఉన్నారని ఆయన గుర్తు చేశారు. 

మరోవైపు..అన్నాడీఎంకేలో చీలికలు వచ్చేలా కనిపిస్తుండంతో పన్నీర్ వర్గం వ్యూహాలు రచిస్తోంది. పళనిస్వామని ప్రభుత్వంపై పార్టీలో తలెత్తుతున్న తిరుగుబాటు ధోరణులను నిశితంగా పరిశీలిస్తోంది. అన్నాడీఎంకేలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను తమకు అనుకూలంగా మల్చుకునే విషయమై బుధవారం తనవర్గంతో పన్నీర్ సెల్వం సమగ్రంగా చర్చలు జరిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com