యోగా దినోత్సవం: మస్కట్ లో ఇండియన్ ఎంబసీ ఈవెంట్
- May 25, 2017
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ప్రతి ఇండియన్ ఎంబసీలోనూ ఓ యోగా టీచర్‌ని ఏర్పాటు చేసి, సంవత్సరమంతా యోగా సెషన్స్ నిర్వహించేందుకు భారత ప్రభుత్వం సమాలోచనలు చేస్తోందని ఒమన్‌లో భారత రాయబారి ఇంద్రా మణి పాండే చెప్పారు. మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న నిర్వహించనున్నట్లు వెల్లడించిన సందర్భంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 2014 డిసెంబర్ 11న యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ, 69/131 రిజల్యూషన్స్‌ని ఆమోదించింది జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని తీర్మానం చేస్తూ. మస్కట్‌లో ఇండియన్ ఎంబసీ ప్రతి ఏడాదీ, ఒమన్‌కి చెందిన యోగా ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్‌తో కలిసి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వమిస్తూ వస్తోంది. 3000 మంది ఒమనీయులు, ఇండియన్స్, ఇతర దేశాలకు చెందినవారితో కలిసి భారీ స్థాయిలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించడం జరిగింది. ఈ ఏడాది కూడా అంతకన్నా ఘనంగా ఒమన్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద ఉదయం 8 గంటలకు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ఎంబసీ వర్గాలు వెల్లడించాయి.
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







