ఆ హీరో అంటే లేవని నోళ్ళు ఇప్పుడు చలపతి అంటే ఎందుకు లేస్తున్నాయి: రాంగోపాల్ వర్మ

- May 26, 2017 , by Maagulf
ఆ హీరో అంటే లేవని నోళ్ళు ఇప్పుడు చలపతి అంటే ఎందుకు లేస్తున్నాయి: రాంగోపాల్ వర్మ

చైతు తాజా సినిమా రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో ఆడవారు మనశ్శాంతి కి హానికరం పై సీనియర్ నటుడు చలపతి రావు చేసిన వ్యాఖ్యాలు సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.. మహిలలతో పాటు ఇండస్ట్రీ కూడా చలపతి రావు ని తప్పు పడుతున్నారు.. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.. ఈ నేపద్యంలో వివాదాల వర్మ తన ట్విట్టర్ ద్వారా రంగంలోకి దిగారు.. ఎప్పుడు వర్మ ఏ విషయంలో ట్వీట్ చేసినా వ్యతిరేకంగా విరుచుకొని పడే నెటిజన్స్ సైతం వర్మ చేసిన ట్విట్స్ కు వంత పడుతున్నారు.. వివరాల్లోకి వెళ్తే... 
చలపతి రావు పై అందరూ చేస్తున్న దండయాత్రను వర్మ తనదైన స్టైల్ లో ట్విట్స్ చేశారు.. చలపతి రావు అన్న ఒక్క మాటతో ఆయన్ని ఇండస్ట్రీ మొత్తం వెలివేయడం ఇండస్ట్రీ సిగ్గుపడాల్సిన విషయం అని వర్మ ట్వీట్ చేశారు.. అంతేకాదు.. మహిళలను ఇంత కంటే దారుణంగా పెద్ద హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ కించపరచినప్పుడు ఈ నోళ్ళు అన్నీ ఏమయ్యాయి అని ప్రశ్నించారు.. మీ అందరికీ దమ్ముంటే మొదట ఆ హీరో చేసిన వ్యాఖ్యల గురించి మాట్లాడి.. నెక్స్ట్ చలపతి రావు గురించి మాట్లాడండి అని వర్మ అన్నాడు. అంతేకాదు బూతు మాటలతో.. బూతు చేష్టలతో వచ్చే కార్యక్రమాలను మెచ్చుకొంటూ... ఓ చిన్న విషయం పై ఇండస్ట్రీలోని సీనియర్ పర్శనన్ ను నానా మాటలు అనడం చూస్తుంటే మన సినిమా రంగంలో కూడా కుటిల రాజకీయాలు ఉన్నాయని రుజువు అవుతుంది అని చెప్పాడు.. అసలు వర్మ ఏ విమర్శలు చేసినా ఎదురు దాడి చేసే నెటిజన్స్ ఈ సారి మాత్రం సపోర్ట్ చేస్తున్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com