షార్జాలో 1 బిలియన్ల దిర్హామ్‌లతో నివాస ప్రాజెక్టు ప్రారంభం
- May 26, 2017
షార్జా ఎమిరేట్‌లో 1 బిలియన్లదిర్హాములతో నివాస సముదాయం యొక్క డిజైన్లు షేఖ్ జాయెద్ హౌసింగ్ ప్రోగ్రాం చేత ఆవిష్కరించబడ్డాయి. పౌరులకు వసతి కల్పించటానికి ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. అల్-సౌహ్ '16' రెసిడెన్షియల్ కాంప్లెక్స్ అతిపెద్ద గృహ ప్రాజెక్ట్ లో రూపొందించనుంది.ఈ కార్యక్రమంలో వాస్తుశిల్పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మొహమ్మద్ అల్ మన్సోరి మాట్లాడుతూ, 812-యూనిట్ ప్రాజెక్టును 1.3 మిలియన్ చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నామని, వీటిని 2020 నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. "ప్రాజెక్ట్ మాస్టర్ ప్లాన్ ఆమోదించబడింది మరియు పునాది కూడా పూర్తయింది. అల్ సయౌహ్ రెసిడెన్షియల్ కాంప్లెక్స్ యొక్క సృజనాత్మకతో కూడిన , అధిక-నాణ్యత మరియు బలమైన -సమర్థవంతమైన నమూనాలు ఈ కార్యక్రమంలో అమలు చేయబడే పరిమాణం మరియు నిర్మాణ నమూనా పరంగా మొట్టమొదటివి. ఎమిరాటీ కుటుంబాల అవసరాలను తీర్చడమే ప్రధాన లక్ష్యంగా ఉంది '' అని ఆయన అన్నారు.'ఇది ఒకే సమయంలో జీవన నాణ్యత, జీవనశైలిని మిళితం చేస్తుంది 'అని ఆయన చెప్పారు. ఈ ప్రణాళికలో 36 డబుల్ బెడ్ రూమ్ యూనిట్లు, 46 త్రిబుల్ బెడ్ రూమ్ యూనిట్లు మరియు 730 నాలుగు బెడ్ రూమ్ యూనిట్లు ఉన్నాయి.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







