మరణశిక్ష తప్పింది జైలు శిక్షతో సరిపెట్టింది
- May 26, 2017
పాకిస్తానీ వ్యక్తి హత్య ఘటనలో మరణ శిక్ష పడ్డ 10 మంది భారతీయులకు, మరణ శిక్ష తప్పించి, జైలు శిక్ష విధిస్తూ అల్ అయిన్ కోర్ట్ తీర్పునిచ్చింది. 10మందిలో ఇద్దరికి మూడున్నరేళ్ళ జైలు శిక్ష, ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష, ఇద్దరికి ఏడాదిన్నర జైలు శిక్ష, మిగిలిన ముగ్గురికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. ఇండియన్ ఎంబసీ ఫస్ట్ సెక్రెటరీ ఫర్ కమ్యూనిటీ ఎఫైర్స్ దినేష్ కుమార్ మాట్లాడుతూ, 2015 నుంచి జైల్లో ఉన్న వారికి ఈ శిక్ష తగ్గింపు ఎంతో ఊరట కలిగిస్తుందనీ, వారి కుటుంబాల్లో ఆనందం వికసిస్తుందని అన్నారు. బాధిత కుటుంబం, క్షమాభిక్షకు అంగీకరించడంతో పదిమంది దోషులకు ఊరట లభించినట్లయ్యింది. ఇండియన్ ఛారిటీ ఆర్గనైజేషన్, సర్బాత్ దా భాలా చారిటబుల్ ట్రస్ట్, ఇప్పటికే బ్లడ్ మనీని న్యాయస్థానంలో బాధిత కుటుంబం కోసం డిపాజిట్ చేసింది. పంజాబ్‌కి చెందిన 11 మంది వ్యక్తులు, పాకిస్తానీ వ్యక్తితో ఘర్షణ పడటంతో, ఈ ఘర్షణలో పాకిస్తానీ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనలో నిందితుల తరఫున, బాధితుడి తండ్రిని క్షమాభిక్ష కోరడం, ఆయన క్షమాభిక్షకు అంగీకరించడంతో ఈ కేసులో మరణ శిక్షలు, జైలు శిక్షలుగా మార్చేందుకు న్యాయస్థానం సుముఖత వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







