ట్రాఫిక్ చలానాలకు డిస్కౌంట్లు
- October 08, 2015
రస్ అల్ ఖైమా పోలీసులు ట్రాఫిక్ చలానాలకు డిస్కౌంట్లు ప్రకటించారు. ఈ డిసెంబర్ నుంచి ట్రాఫిక్ చలాన్లు చెల్లించేవారు ఎంత త్వరగా వాటిని చెల్లిస్తే, అంత ఎక్కువగా డిస్కౌంట్లు పొందే అవకాశం ఉంది. రస్ అల్ ఖైమా పోలీస్ డిపార్ట్మెంట్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సెంట్రల్ ఆపరేషన్స్ అహ్మద్ ఘనిమ్ మాట్లాడుతూ ఈ విషయాన్ని ధృవీకరించారు. చలానాను 50 రోజుల్లోగా చెల్లిస్తే, 50 శాతం డిస్కౌంట్ లభిస్తుందట. 51 నుంచి 80 రోజుల్లో చెల్లిస్తే 30 శాతం డిస్కౌంట్ ఇస్తారు. 80 రోజుల తర్వాత చెల్లించాలనుకునేవారికి ఎలాంటి డిస్కౌంట్లూ లభించవు. రస్ అల్ ఖైమాకి చెందిన చలాన్లకే ఈ డిస్కౌంట్ సౌకర్యం ఉంటుందన్నారు బ్రిగేడియర్ ఘనిమ్.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీల్లో విశాఖ టాప్
- కార్మికుల సంక్షేమానికి దుబాయ్ పోలీసుల ‘షేడ్ అండ్ రివార్డ్’ కార్యక్రమం..
- భారత్–యూఏఈ సంయుక్త కాన్సులర్ కమిటీ 7వ సమావేశం
- బహ్రెయిన్పై ఇరాన్ క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతలంలోనే ధ్వంసం చేసిన బహ్రెయిన్ రక్షణ దళాలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!







