తిరుమల తిరుపతి బ్రహ్మోత్సవాలు
- October 09, 2015
కలియుగదైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ నెల 14 నుండి 22 వ తేదీ వరకు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని తిరుమలతిరుపతి దేవస్థానం జేఈవో కె. శ్రీనివాసరాజు వెల్లడించారు. శుక్రవారం తిరుమలలో శ్రీనివాసరాజు విలేకరుతో మాట్లాడుతూ... ఈ బ్రహ్మోత్సవాలలో సామన్య భక్తులకే పెద్దపీట వేస్తున్నట్లు తెలిపారు. వృద్ధులు, చంటిపిల్లల దర్శనాలు రద్దు చేసినట్లు... అలాగే ప్రత్యేక ప్రవేశ దర్శనాలు కుదించినట్లు ఆయన వివరించారు. గరుడ వాహనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆయన చెప్పారు. రేపటి నుంచి పాఠశాలకు దసరా సెలవుల నేపథ్యంలో భారీ సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం ఉందన్నారు. అయితే 17వ తేది అర్దరాత్రి 12 గంటల నుండి 20వ తేది ఉదయం 10గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్ర వాహనాలు అనుమతించనివ్వమని తిరుపతి పట్టణ ఎస్పీ గోపినాథ్ తెలిపారు.
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







