ఇరామ్ ఇంటర్నేషనల్‌తో ఐకాన్స్ కాఫీ బంధం
- May 30, 2017ఇరామ్ ఇంటర్నేషన్తో కలిసి ఐకాన్స్ 'కెఎస్ఎ' (కింగ్డమ్ ఆఫ్ సౌదీ అరేబియా) 15 కొత్త బ్రాంచ్‌ల అభివృద్ది కోసం ఒప్పందం కుదర్చుకుంది. దమ్మమ్‌లో తొలి ప్రాజెక్ట్ ప్రస్తుతం నిర్మాణంలో ఉంది. ఫ్యాషన్ మరియు లైఫ్‌స్టైల్ కాఫీ షాప్ చైన్‌గా గుర్తింపు పొందిన ఐకాన్స్ కాఫీ కోచర్, ఇరామ్ ఇంటర్నేషనల్‌తో కలిసి ఒప్పందం కుదుర్చుకోవడం జరిగింది. దమ్మమ్, ఖోబార్ సిటీల్లో 2017లో బ్రాంచ్‌లు ప్రారంభం కానున్నాయి. రియాద్, అల్ అహ్సా, సుబైల్లలో 2018 నాటికి బ్రాంచ్‌లను ప్రారంభిస్తారు. రివేరా మాల్లో తొలి ఐకాన్స్ బ్రాంచ్ని ఏర్పాటు చేస్తున్నారు. రీజియన్‌లో అత్యంత లగ్జరియస్‌గా తమ సంస్థ కార్యకలాపాల్ని నిర్వహిస్తోందని నిర్వాహకులు తెలిపారు. ఐకాన్స్ కాఫీ కోచర్ ఫౌండర్ ఎలెనా వెబర్ మాట్లాడుతూ, ఆరోగ్యకరమైన, అద్భుతమైన కాఫీ రుచుల్ని, అలాగే అత్యంత లగ్జరియస్ వాతావరణంలో అందించేందుకు తమ సంస్థ ఇరామ్ ఇంటర్నేషనల్‌తో కలిపి ఈ బ్రాంచ్‌లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎరామ్ ఇంటర్నేషనల్ బిజినెస్ డెవలప్మెంట్ మేనేజర్ మొహమ్మద్ అబు జైద్ మాట్లాడుతూ, ఐకాన్ సంస్థతో తమ ప్రయాణం అద్భుతంగా సాగుతుందని అన్నారు. కెఎస్ఎలో తమ నెట్వర్క్ అద్భుతమైన విజయాల్ని సాధిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
- తెలంగాణ: ఆర్టీసీ సమ్మెలో కీలక మలుపు..
- సచిన్ టెండూల్కర్ 53వ పుట్టినరోజు: ఫ్యాన్స్‌తో కలిసి వేడుకలు..
- మైక్రోసాఫ్ట్ ‘బైఅవుట్’ ఆఫర్
- ఏప్రిల్ 26 నుండి జజీరా ఎయిర్వేస్ నేరుగా విమాన సర్వీసులు ప్రారంభం
- యువ టెక్ మేధస్సుల కోసం 'టినీ టెక్నీస్-2కే26' టెక్నో స్కిల్స్ బూట్‌క్యాంప్
- SR 4 మిలియన్ల ఫైన్స్ వేసిన ఆరోగ్య బీమా మండలి..!!
- కువైట్ లో సామాజిక సమావేశాల పై నిషేధం ఎత్తివేత..!!
- షార్జాలోని అల్ ధైద్‌లో 13 టన్నుల పాడైన ఫుడ్ ధ్వంసం..!!
- విదేశాంగ మంత్రితో అమెరికా రాయబారి సమావేశం..!!
- అల్ సీబ్‌లో డ్రగ్ కలకలం..అరబ్ జాతీయుడు అరెస్టు..!!









