బంగారు తెలంగాణ అంటే ఇదేనా...?
- June 01, 2017
తెలంగాణలో కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించింది.. సంగారెడ్డిలో ప్రజా గర్జన వేదిక పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభకు విశేష స్పందన లభించింది.. సభకు భారీగా జనం తరలివచ్చారు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పాల్గొన్న ఈ సభ నుంచే 2019 ఎన్నికల కోసం వ్యూహాలు మొదలు పెట్టింది టీ కాంగ్రెస్.
రైతుల ఆత్మహత్యలతో తెలంగాణ శ్మశానంగా మారుతోందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వప్నం నెరవేరిందా అని ప్రశ్నించారు. గత మూడేళ్లలో 2800 మందికిపైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న కేసీఆర్.. ఊరికో ఉద్యోగం అయినా ఇచ్చారా అని ప్రశ్నించారు. ప్రజా గర్జన పేరుతో సంగారెడ్డిలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాంట్రాక్టర్లు, ల్యాండ్ మాఫియా హితం కోసం ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని దుయ్యబట్టారు.
తాజా వార్తలు
- లక్నో పై గుజరాత్ ఘన విజయం
- స్కామ్ వివాదం పై నోరువిప్పిన సింగర్ మంగ్లీ
- భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌కు యూఏఈ అధ్యక్షుడు ఘన స్వాగతం..
- ట్రంప్ సంచలన ప్రకటన..
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్‌లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!









