దుబాయ్ లో 52 మంది బిక్షగాళ్ళు పట్టివేత
- June 02, 2017
దుబాయ్: సిఐడి తనిఖీ పోలీసులు 52 మంది బిక్షగాళ్ళను దుబాయ్ లో అరెస్టు చేశారు. మే 11 వ తేదీన న ప్రారంభించిన బిక్షాటన వ్యతిరేక ప్రచారం ప్రారంభించినట్లు అందులో భాగంగా వారిని అదుపులోనికి తీసుకొన్నట్లు దుబాయ్ పోలీసు ఛీఫ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎఫైర్స్ అసిస్టెంట్ మేజర్ జనరల్ ఖలీల్ ఇబ్రహీం అల్ మన్సోరి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దుబాయ్ లోని అన్ని ప్రాంతాలలో ఈ తనిఖీలను చేపట్టేందుకు పోలీసు తనిఖీ బృందాలు వివిధ ప్రదేశాలకు సి ఐ డి జట్లను కేటాయించారు. వీరు బహిరంగ స్థలాలు, షాపింగ్ కేంద్రాలు, మసీదులు ,నివాస ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. "మేము కేవలం కొన్ని రోజుల్లో బిచ్చగాళ్ళను నిరోధించడానికి వివిధ ప్రాంతాల్లో మరింత గస్తీ పెంచినట్లు పేర్కొన్నారు. అంతేకాక రహస్య పోలీసులు సైతం సాధారణ వ్యక్తుల మాదిరిగా పర్యవేక్షిస్తున్నారు. మేము అక్రమంగా దేశంలోకి ప్రవేశించిన 16 మందితో సహా 52 మంది యాచకులను పట్టుకున్నామని, రంజాన్ నెలలో డబ్బు సంపాదించడానికి వారు ఇక్కడకు వచ్చినట్లు వారు స్వయంగా ఒప్పుకున్నారని మాజ్-జెన్ అల్ మన్సోరి చెప్పారు. బిచ్చగాళ్ళను అడ్డుకొని తమకు సాయపడటానికి కమ్యూనిటీకి ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. "బిచ్చగాళ్ళు గురించి మాకు తెలియజేయడం ద్వారా మాకు సహాయం చేయటానికి ప్రజలు మరింత ముందుకు వస్తున్నారు, తద్వారా మేము ఆ బిక్షాటన అరెస్టు చేసి సమస్యను పరిష్కారిస్తామని అని మేజ్-జెన్ అల్ మన్సోరి ప్రకటించారు.
తాజా వార్తలు
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మొక్కను నాటిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- సల్మాన్ టౌన్లో మరిన్ని హోమ్స్ నిర్మాణం..!!
- ముందు లైసెన్స్.. ఆ తర్వాత అమ్మకం: దుబాయ్ మున్సిపాలిటీ
- నేషనల్ డిజిటల్ ఇండెక్స్ ను ప్రారంభించిన ఖతార్..!!
- బెంగళూరు–విజయవాడ ప్రయాణం ఇక 4 గంటల్లోనే!
- KNET లో కొత్తగా డైరెక్ట్ కార్డ్ ఎంట్రీ సిస్టమ్.. పోర్టల్ అప్గ్రేడ్..!!
- ఒమన్ లో డిజిటల్ మీడియాకు లైసెన్సులు తప్పనిసరి..!!
- డైమండ్ హోదాను పొందిన కింగ్ ఫైసల్ హాస్పిటల్..!!
- దిబ్బా తీరంలో తొమ్మిది మంది అరెస్టు..!!
- కువైట్ లో మహిళను జైలుపాలు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్..!!









