హైదరాబాద్ లో దారుణం కార్టూన్ ఛానల్ చూసి ఒంటికి నిప్పంటించుకున్న12 ఏళ్ల బాలుడు
- June 02, 2017
కార్టూన్ ఛానల్ చూసి ఓ బాలుడు ఒంటికి నిప్పంటించుకుని మృతి చెందిన ఘటన హైదరాబాద్ బాలాపూర్ ఠాణా పరిధిలోని వెంకటాపురంలో జరిగింది. జియాగూడాకు చెందిన జయదీప్ అనే 12 ఏళ్ల బాలుడు ఐదేళ్లుగా వెంకటాపురంలోని తన తాతగారి ఇంట్లో ఉంటూ ఐదవ తరగతి చదువుతున్నాడు. వేసవి సెలవులు కావడంతో ఓ టీవీలో కార్టూన్ ఛానల్ చూస్తుండగా అందులోని కొన్ని బొమ్మలు పెట్రోల్ పోసుకుని దహనమవుతోన్న దృశ్యాలు వస్తున్నాయి. మంటల్లో కూడా అవి సంతోషంగా ఎగురుతున్నాయి. దీన్నిస్పూర్తిగా తీసుకున్న ఆ బాలుడు తానూ అలా చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా డాబా పైకెళ్లి కిరోసిన్ ఒంటి మీద పోసుకుని నిప్పంటించుకున్నాడు. అంతేకాకుండా .. నా శరీరంపై వస్తున్న మంటలు చూడండి అంటూ తన తాతయ్య, అమ్మమ్మలకు వినపడేట్టు గట్టిగా అరిచాడు.
తీవ్ర దిగ్భాంతికి గురైన బాలుడి తాతయ్య,అమ్మమ్మ.. మంటలు ఆర్పి చికిత్స కోసం వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.అప్పటికే 70 శాతం కాలిపోవడంతో చికిత్స పొందుతూ బాలుడు మరణించాడు.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్లో భారతీయ పాస్పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







