ఫ్యాషన్ డిజైనర్ రివ్యూ

- June 02, 2017 , by Maagulf
ఫ్యాషన్ డిజైనర్ రివ్యూ

రివ్యూ: ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్
తారాగణం: సుమంత్ అశ్విన్, అనీషా ఆంబ్రోస్, మనాలీ రాథోడ్, మానస హిమవర్షిణి, కృష్ణభగవాన్, కృష్ణుడు, రాఘవేంద్ర తదితరులు
సినిమాటోగ్రఫీ: నగేశ్ బన్నెల్
మ్యూజిక్: మణిశర్మ
నిర్మాత: మధుర శ్రీధర్
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్: వంశీ
రిలీజ్: 02 జూన్ 2017

టాలీవుడ్ లో సీక్వెల్స్ హిట్ అయిన హిస్టరీ లేదు. కానీ లేడీస్ టైలర్ సీక్వెల్ గా ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమా వస్తుందనగానే ఆడియన్స్ లో క్యూరియాసిటీ జనరేట్ అయ్యింది. వంశీ ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్ తో ఈసినిమా రావడంతో ఇండస్ట్రీలో కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. పైగా ట్రైలర్, ఆడియో సాంగ్స్ కూడా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. దీంతో ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ ఎంటర్టైన్ చేస్తుందనే అంచనాలు మొదలయ్యాయి. మరి వంశీ ఈ ఎక్స్ పెక్టేషన్స్ ను అందుకున్నాడా? లేదా? చూద్దాం

కథ:
లేడీస్ టైలర్ సుందరం గారి అబ్బాయి గోపాళం(సుమంత్ అశ్విన్). తండ్రి వారసత్వంగా ఈ అబ్బాయి కూడా టైలరింగ్ ని కంటిన్యూ చేస్తుంటాడు. కానీ టైలర్ అంటే మాత్రం ఒప్పుకోడు. ఫ్యాషన్ డిజైనర్ నని చెప్పుకుంటుంటాడు. నర్సాపురంలో పెద్ద బొటిక్ పెట్టుకుని పెద్ద ఫ్యాషన్ డిజైనర్ కావాలని కలలు కంటుంటాడు. అయితే అంతపెద్ద షాప్ పెట్టుకోవడానికి గోపాళం దగ్గర సరిపడ డబ్బులు ఉండవు. దీంతో గోపాళం మలయాళీ జ్యోతిష్యుడి దగ్గరకు వెళ్తాడు. అక్కడ ఆ జ్యోతిష్యుడు గాపాళానికి మన్మదరేఖ ఉందని, కోటికొక్కడికి ఇలాంటి రేఖ వుంటుందని, అమ్మాయిలు ఆ రేఖకు ఈజీగా పడిపోతారని చెప్తాడు.దీంతో గాపాళం ఆరేఖను వాడుకుని డబ్బున్న అమ్మాయిన పడెయ్యాలని ప్లాన్ చేస్తాడు. ఆ ప్లానింగ్ లోనే గేదెల రాణి(మానస హిమవర్షిణి), అమ్ములు(మనాలీ రాథోడ్), మహాలక్ష్మి(అనీషా ఆంబ్రోస్)ల వెంటపడతాడు. అయితే ఆ ముగ్గురి ప్రేమతో గోపాళం లైఫ్ రిస్క్ లో పడుతుంది. ఆ రిస్క్ నుంచి గోపాళం ఎలా బయటపడ్డాడు? గోపాళం ఫ్యాషన్ డిజైనర్ అయ్యాడా? లేదా? అన్నది మిగిలిన కథ.

విశ్లేషణ:
వంశీ సినిమాలు అనగానే గోదారి అందం వెండితెరను నింపేస్తుంది. ఈ ఫ్యాషన్ డిజైనర్ కూడా ఇలాగే గోదారి అందాలతో విజువల్ ఫీస్ట్ గా ఉంది. వంశీ మార్క్ ఫ్రేమింగ్ తో సినిమా చాలా అందంగా కనిపించింది. తన సీక్వెల్ స్టోరీని ఈ అందాలతోనే మిక్స్ చేసి చెప్పాడు వంశీ. గోదారి యాస, యటకారంతో కామెడీగా సినిమాను రన్ చెయ్యడానికి ట్రై చేశాడు. తనకంటూ ఏర్పరుచుకున్న ఆ మార్క్ నే ఇప్పటికీ విడిచిపెట్టకుండా ఫ్యాషన్ డిజైనర్ ను తెరకెక్కించాడు. డైలాగులు,పాటలు అనే తేడా లేకుండా ప్రతీ సన్నివేశంలో తనమార్కు చూపించాడు. ఇది వంశీ అభిమానులను బాగానే అలరించింది. ఇక ఫ్రేమింగ్ తో పాటు ఆర్ ఆర్ లోనూ తన పాత ముద్ర చూపించాడు. కామెడీ పంచ్ ల వెంట చిన్న సెటైరికల్ అరుపులు పెట్టాడు. కృష్ణ భగవాన్ కామెడీ బాగానే పండింది.ముఖ్యంగా రామరాజు గొడుకు కథకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. విజువలైజేషన్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్స్ లో తన మార్క్ చూపించిన వంశీ, కథనంలో ప్రత్యేకతను అంతగా చూపించలేకపోయాడు. ఫస్టాఫ్ ను కామెడీ డైలాగులు వాటితో రన్ చేసిన వంశీ, ఇంటర్వెల్ వరకు పెద్దగా ఆడియన్స్ పై ఇంపాక్ట్ చూపించలేదు. ఇక సెకండాఫ్ లో ముగ్గురు అమ్మాయిలు హీరోను ప్రేమించడం వాళ్ల నుంచి తప్పించుకోవడానికి గోపాళం పడే పాట్లు ఫన్నీగానే ఉన్నాయి. అయితే ఫ్యాషన్ డిజైనర్ లేడీస్ టైలర్ సీక్వెల్ గా వచ్చినా, సినిమాలో ఆ ఛాయలు ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు వంశీ. అయితే తన మార్క్ చూపించే క్రమంలో పాటల్లో స్లో మోషన్ షాట్లు, స్టిల్ ఫోటోస్ ను మూవ్ చేస్తూ తెరకెక్కించిన పాపికొండల్లో సాంగ్ అంత చూడబుల్ గా అనిపించలేదు. ఆడియోకు, వీడియోకు సింక్ అయినట్లు కనిపించదు. ఇక ఆర్టిస్టుల విషయానికి వస్తే గోదారి కుర్రాడు గోపాళంగా నటించడానికి సుమంత్ అశ్విన్ బాగానే కష్టపడ్డాడు. పర్ఫెక్ట్ గోదారి స్లాంగ్ ను దించేశాడు. పాత్రలో ఉండే హైపర్ యాక్టివిటీని క్యారీ చేశాడు. అయితే మరీ ఇంట్రడక్షన్ సీన్స్ లోనే సుమంత్ అశ్విన్ లిప్ సింక్ కు డైలాగ్స్ కు మ్యాచ్ కాలేదు. కానీ ఫస్టాఫ్ లో కొంచెం గోదారి కుర్రాడి పాత్రగా బిహేవ్ చెయ్యడానికి చేసిన వర్కవుట్స్ సెకండాఫ్ కు వచ్చేసరికి బాగానే పనికొచ్చింది. సుమంత్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించాడు. యాక్టింగ్ పరంగానూ ఇంప్రెస్ చేశాడు. ఇక మహాలక్ష్మిగా అనీషా ఆంబ్రోస్, అమ్ములుగా మనాలీ రాథోడ్ కూడా పాత్రకు తగ్గట్లుగా బాగానే చేశారు. గేదెల రాణి పాత్రలో మానస చాలా హైపర్ గా కనిపించింది. ఇక కృష్ణభగవాన్ కొంచెం బలహీనంగా కనిపించినా పాపారావ్ పాత్రలో మాత్రం సూపర్బ్ గా చేశాడు. కృష్ణుడు ఉన్నంతవరకు పర్వాలేదనిపించుకున్నాడు. ఇక స్టార్ మేకర్ సత్యానంద్ కొడుకు రాఘవేంద్ర, గోపాళం ఫ్రెండ్ గా సినిమా అంతగా ఉన్నా, తన మార్క్ చూపించుకోలేకపోయాడు. అమ్మాయిల వెంటపడే పోకిరిగాళ్లను కాల్చేసే గౌరరాజు పాత్ర చేసిన ఆర్టిస్ట్ ఎక్స్ ప్రెషన్స్ కు డైలాగ్స్ కు అంతగా పొంతన కుదరలేదు. ఇక టెక్నీషియన్స్ విషయానికొస్తే సినిమాటోగ్రఫీ సినిమాకు చాలా బలంగా నిలిచిందని చెప్పొచ్చు. నగేశ్ బన్నెల్ గోదారి అందాలను ఐఫీస్ట్ గా క్యాప్చర్ చేశాడు. పాపికొండలు, గోదారి పాయలు, లంకలు, అన్నింటిని చాలా అందంగా చూపించాడు. ఇక కీరవాణి సంగీతం సినిమాకు పిల్లర్ గా నిలిచాయని చెప్పొచ్చు. ప్రతీ పాటను బ్యూటిఫుల్ మెడ్లీగా ట్యూన్ చేశాడు. అయితే వీటిలో వంశీ మార్క్ మిక్స్ కావడంతో ఆడియన్స్ కొంచెం ఇబ్బందిపడతారు. వీటన్నింటిని పక్కనపెడితే ఈ గోపాళం కథ, వంశీ సినిమాలను బాగా లైకింగ్ చేసే వాళ్లకు నచ్చుతుంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com