తప్పిపోయిన బాలుడి మృతదేహం లభ్యం

- June 03, 2017 , by Maagulf
తప్పిపోయిన బాలుడి మృతదేహం లభ్యం

11 ఏళ్ళ బాలుడు, గురువారం నుంచి తప్పిపోయినట్లు తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, అతని మృతదేహాన్ని అబుదాబీలోని అతని ఇంటి రూఫ్‌ టాప్‌ మీద గుర్తించారు పోలీసులు. కుటుంబ సభ్యులు చెప్పిన వివరాల ప్రకారం, అజాన్‌ మాజిద్‌ అనే 11 ఏళ్ళ బాలుడు, సమీపంలోని మాస్క్‌కి ప్రార్థనల నిమిత్తం వెళ్ళాడు. రూఫ్‌ టాప్‌ మీద అతని మృతదేహం లభ్యం కావడం పట్ల బంధువులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇంతకుముందు ఎప్పుడూ ఇక్కడ ఇలాంటి ఘటనలు జరగలేదని ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు చెప్పారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com