తెలంగాణ లో ప్రపంచ తెలుగు మహాసభలకు సన్నద్ధం
- June 03, 2017
రవీంద్రభారతిని మరింత అందంగా తీర్చిదిద్దుదాం
ఈ ప్రాంగణంలోనే సాహిత్య అకాడమీ ఏర్పాటు
అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్
ప్రపంచ తెలుగు మహాసభలకు సంబంధించి తగిన కార్యాచరణ రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులకు సూచించారు. శనివారం రవీంద్రభారతికి వచ్చిన ముఖ్యమంత్రి అక్కడి పరిసరాలను క్షుణ్నంగా పరిశీలించి పలు సూచనలు చేశారు. అనంతరం హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఇతర అధికారులతో సాహిత్య అకాడెమీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ తెలుగుభాషను కాపాడేందుకు, భాష ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలని కోరారు. సాహిత్య అకాడమీ, సాంస్కృతిక శాఖ సమన్వయంతో పని చేయాలని సూచించారు. అంతకుముందు రవీంద్రభారతిని పరిశీలించి.. దీనిని మరింత అందంగా తీర్చిదిద్ది..
గొప్పగా వినియోగించుకునేందుకు అవసరమైన చర్యలు చేట్టాలని తెలిపారు. రవీంద్రభారతి కార్యాలయాన్ని (కుడివైపు గుడిసె తరహాలో ఉండేది), బుకింగ్ కేంద్రాలను కూల్చివేసి, ఆ ప్రాంతమంతా చదును చేసి, పచ్చిక బయళ్లతో సుందరీకరించి పార్కింగ్ స్థలాన్ని విస్తరించాలని అధికారులకు ఆదేశించారు. ప్రధానంగా సాహిత్య అకాడెమీ కార్యాలయాన్ని కూడా రవీంద్రభారతి ప్రాంగణంలోని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కళాభవన్ మొదటి అంతస్తులో ఉన్న ఆర్ట్ గ్యాలరీని అవసరమైతే వందమంది కూర్చునేందుకు వీలయ్యే సమావేశ మందిరంగా మారిస్తే ఎలా ఉంటుందని ఆరా తీశారు.
కళాభవన్కు డీజీపీ కార్యాలయం వైపు ఉన్న ద్వారం గుంతలా ఉందని.. వాస్తు ప్రకారం అది మంచిదికాదని వివరించారు. దాన్ని ఎలా పూరించాలో ఆలోచించాలని చెప్పినట్లు తెలిసింది. అంతకుముందు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి ఈ సమీక్షలో పాల్గొన్నారు.
సాహిత్య అకాడెమీ ఛైర్మన్ నందిని సిధారెడ్డి, ప్రభుత్వ సలహాదారు డా॥కె.వి.రమణాచారి, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, సంచాలకులు మామిడి హరికృష్ణ ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. రవీంద్రభారతి ఐసీసీఆర్ ఆర్ట్ గ్యాలరీలో కొలువైన బాతిక్ చిత్ర కళా ప్రదర్శనను ముఖ్యమంత్రి కేసీఆర్ కాసేపు వీక్షించారు. భాషా సాంస్కృతిక శాఖ సహకారంతో చిత్రకారుడు యాసల ప్రకాశ్ వేసిన ఆ చిత్రాలను చూసి తెలంగాణ సంస్కృతి ఉట్టిపడుతోందని అన్నారు.
తాజా వార్తలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!
- హెన్లీ గ్లోబల్ ర్యాంకింగ్స్..ఖతార్ పాస్పోర్ట్ ముందంజ..!!
- తిరుమల లగేజీ కౌంటర్ సేవలు పూర్తిగా ఉచితం: టీటీడీ ప్రకటన
- మహిళా రిజర్వేషన్ బిల్లుతో సరికొత్త చరిత్ర: ప్రధాని మోదీ
- ‘మళ్లీ టీఆర్ఎస్గా’..! కేటీఆర్ కీలక వ్యాఖ్యలు









