దసరాకు ముగ్గురు స్టార్ హీరో ల మధ్య పోటీ
- June 03, 2017
సంక్రాంతి తర్వాత సినిమా వాళ్లకు అతి పెద్ద పండగా అంటే దసరా అని చెప్పాలి..ముఖ్యం గా దసరా తెలంగాణ లో పెద్ద పండగా..అందుకే పెద్ద సినిమాలు దసరా బరిలో దించడానికి ప్లాన్ చేస్తుంటారు..ఇక ఈ దసరా సినీ ప్రేక్షకులకు మరింత జోరు ను నింపబోతుంది..ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు పెద్ద సినిమాలు రాబోతున్నాయి..అవి కూడా ముగ్గురు ముగ్గురే అనిపించుకున్న హీరోలు..ఎవరా అని చూస్తున్నారా..మహేష్ బాబు , బాలకృష్ణ , పవన్ కళ్యాణ్.
అవును మహేష్ బాబు - మురుగదాస్ కాంబినేషన్ తెరకెక్కుతున్న స్పైడర్ , త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ, పూరి - బాలయ్య కాంబినేషన్ లో తెరకెక్కుతున్నమూవీ..ఈ మూడు సినిమాలు సెప్టెంబర్ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పవన్ మూవీ ప్టెంబర్ 21న లేదా 25 రిలీజ్ అవడం ఖాయమని సమాచారం. అంటే దసరాకి ముందుగా వచ్చి, తెలంగాణలో జరిగే బతుకమ్మ సంబరాలని కూడా క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారన్నమాట. సెప్టెంబర్ 27న స్పైడర్ రిలీజ్ చేయాలనీ అనుకుంటున్నారు ..సెప్టెంబర్ 29న బాలయ్య-పూరిల సినిమా వస్తుందని ఎప్పుడో ప్రకటించారు. మరి ఈ మూడు చిత్రాలకు థియేటర్స్ దొరుకుతాయా.అనేది చూడాలి.
తాజా వార్తలు
- డిగ్రీ అడ్మిషన్ల షెడ్యూల్ మరియు ముఖ్యమైన తేదీలు!
- అందుబాటులోకి 62 గ్రామీణ అన్న క్యాంటీన్లు
- పూర్తయిన ఆశా భోంస్లే అంత్యక్రియలు..
- తెలంగాణ: ప్రభుత్వ ఆసుపత్రుల్లో హెల్త్ ఏటీఎంలు
- ఉమ్రా వీసాల జారీ నిలిపివేత..మక్కా ప్రవేశం పై ఆంక్షలు..!!
- రిటైల్ పేమెంట్స్.. 85% వాటా ఈ-చెల్లింపులదే..!!
- అక్షయ తృతీయకు ముందు దుబాయ్లో తగ్గిన బంగారం ధరలు..!!
- తాజా పరిణామాల పై సుల్లాన్, యూకే పీఎం చర్చలు..!!
- ప్రైవేట్ సంస్థల్లో క్లాస్ రూమ్ లెర్నింగ్ తిరిగి ప్రారంభం..!!
- కువైట్ పౌరసత్వ చట్టానికి సవరణలు..గెజిట్లో పబ్లిష్..!!









