ఎ టి ఎం దోపిడీ యత్నం ..నిఘా కెమెరాలో నిందితుని ఆచూకీ
- June 04, 2017
మనామ:తీగ ..లాగితే , డొంక అంత కదిలిన తీరులో ఎ టి ఎం దోపిడీ యత్నంకు పాల్పడిన నిందితుడిని ఎంచక్కా పట్టించిన సీసీటీవీ రికార్డ్ చేసిన సమాచారంకు పోలీసులు ధన్యవాదాలు తెలియచేస్తున్నారు., పోలీసులు ఎ టి ఎం దోపిడీకి యత్నించిన వ్యక్తి యొక్క కారు రిజిస్ట్రేషన్ నంబర్ ను ఉపయోగించి ఆ నిందితుడిని పట్టుకొన్నారు, బుసాటీన్ లోని ఒక ఎటిఎం ను పగలకొట్టి దోపిడీకి పాల్పడే ప్రయత్నంలో విఫలమైన అనుమానితుడు ఒక ఆసియా వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఆ అనుమానితుడు, ఎటిఎం లోపల అమర్చిన సీసీటీవీ కెమెరాలపై నల్లని రంగు పెయింట్ చిమ్మిన నేరస్థుడు ఎటువంటి ఆధారాలు లేకుండా చేసెనని సంబరపడ్డాడు. ఎటిఎం ను పగలకొట్టే ప్రక్రియలో ఆ యంత్రాన్ని కూడా పాడుచేశాడు. ఈ దొంగతనం గూర్చి నేర పరిశోధకులు ఎటిఎం సమీపంలోని వివిధ మార్గాలలో కూడళ్ల లలో ఏర్పాటుచేసిన వేరే ఇతర సిసి టీవీ కెమెరాల ఫుటేజ్ ను స్కానింగ్ చేసి క్షుణంగా పరిశీలించారు. ఎటిఎం చోరీకి పాల్పడిన నిందితుడిని అతనికి చెందిన కారుని గుర్తించగలిగారు, ముహర్రాక్ పోలీస్ డైరెక్టరేట్, కెప్టెన్ యూసఫ్ ముల్లా బాకీత్ ఈ కేసుపై దర్యాప్తు జరిపారు.
తాజా వార్తలు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!
- సౌదీలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం..!!
- సముద్ర భద్రతకు ప్రాధాన్యం.. లాటిన్ అమెరికాతో గల్ఫ్ దేశాల కొత్త బంధం..!!
- మానవ అక్రమ రవాణా నిరోధంలో ఒమన్ కీలక చర్యలు..!!
- రియాద్ విమానాశ్రయం పై దాడి.. 12 మంది మృతి, 309 మందికి గాయాలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..







