యూపీలో ఘోర రోడ్ ప్రమాదం 22మంది మృతి.. 24మందికి గాయాలు

- June 04, 2017 , by Maagulf
యూపీలో ఘోర రోడ్ ప్రమాదం 22మంది మృతి.. 24మందికి గాయాలు

ఉత్తర ప్రదేశ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 22 మంది చనిపోయారు. మరో 24 మంది గాయపడ్డారు.ఉత్తర ప్రదేశ్ లో ఓ వివాహానికి హాజరై వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. 40 మంది ప్రయాణికులతో బయలుదేరిన మినీ వ్యాన్ ఎటావా  జిల్లాలోని సరైనీమ్ గ్రామ సమీపంలో కాల్వలో బొల్తా పడింది.  బాధితులంతా ఆగ్రాకు చెందిన వారు. ఫతేబాద్ రోడ్డులోని కుందల్ నగరీయ గ్రామం నుంచి తిరిగి వస్తుండా మలుపు వద్ద మినీ వ్యాన్  అదుపు తప్పింది. వ్యాన్ కాల్వలో పడిపోయిందని అధికారులు తెలిపారు. వెంటనే ఈ ప్రమాద విషయాన్ని తెలుసుకున్న ఉన్నతాధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ముమ్మరం చేశారు.  గాయపడిన క్షతగ్రాత్రులను ఆగ్రా హాస్పిటల్‌కు తరలించారు. గాయపడ్డవారిలో మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ట్రక్కును ఢీకొన్న తర్వాత బస్సులో మంటలు అంటుకున్నట్లు ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్నారు. బరేలీ షహ్జాన్ పూర్ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకోగా.. ప్రమాద స్థలంలో కొన్ని నిర్మాణ పనులు జరుగుతున్నట్లుగా సమాచారం. బస్సును డ్రైవర్ సరైన మార్గంలో నడపనందువల్లే ఈ ప్రమాదం  జరిగింది. ప్రమాదం జరిగినపుడు బస్సులోని ప్రయాణికులంతా గాఢ నిద్రలో ఉన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com