బాహుబలి నిర్మాతలు తర్వాత సినిమా శర్వా లాంటి క్రేజీ హీరోతో

- June 04, 2017 , by Maagulf
బాహుబలి నిర్మాతలు తర్వాత సినిమా శర్వా లాంటి క్రేజీ హీరోతో

బాహుబలి సినిమాతో తమ సినిమా ప్యాషన్ ఏంటో చూపించారు నిర్మాతలు శోభు, ప్రసాద్ లు తమ తర్వాత సినిమాకు సన్నద్ధం అవుతున్నారు. బాహుబలి లాంటి భారీ రేంజ్ సినిమా తీశాక ఇప్పుడు వారు ఎలాంటి సినిమా తీస్తారన్న దాని మీద ఆడియెన్స్ దృష్టి ఉంది. దాదాపు 1650 కోట్ల గ్రాస్ కలక్షన్స్ వసూళు చేసిన బాహుబలి మూవీ నిర్మాతలు తమ తర్వాత ప్రాజెక్ట్ శర్వానంద్ హీరోగా చేస్తున్నట్టు తెలుస్తుంది.
ఇక ఈ సినిమాను ప్రకాశ్ కోవెలమూడి డైరెక్ట్ చేస్తారని టాక్. ప్రస్తుతం చర్చల దశల్లో ఉన్న ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ త్వరలో రాబోతుంది. శతమానం భవతి తో సూపర్ హిట్ అందుకున్న శర్వానంద్ రీసెంట్ గా వచ్చిన రాధ సినిమాతో వెనుకపడ్డాడు. ఇక ప్రకాశ్ కోవెలమూడితో ఓ ప్రయోగాత్మక సినిమా చేస్తున్నాడట శర్వానంద్.
బాహుబలి తర్వాత మేకర్స్ చేస్తున్న సినిమాగా ఆర్కా మీడియా నుండి వస్తున్న ఈ ప్రాజెక్ట్ సూపర్ క్రేజ్ ఏర్పరచుకుంటుంది. శర్వా లాంటి క్రేజీ హీరోతో ఆర్కా మీడియా చేసే ఈ సినిమా కేవలం తెలుగులోనే కాదు తమిళ హిందిల్లో కూడా రిలీజ్ చేస్తారని తెలుస్తుంది. చిన్న సినిమాతో మొదలైన ఆర్కా మీడియా ప్రస్థానం బాహుబలి లాంటి సినిమా చేశారు.
రాబోతున్న శర్వానంద్ సినిమా కూడా లిమిటెడ్ బడ్జెట్ తోనే ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమా మిగతా స్టార్ కాస్ట్ ఎవరన్నది త్వరలో తెలుస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి టాలీవుడ్ లో మంచి హైప్ క్రియేట్ అవుతుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com