భారీగా పెరిగిన బంగారం దిగుమతులు
- June 05, 2017
న్యూఢిల్లీ: బంగారం దిగుమతులు మే నెలలో భారీగా పెరిగాయి. గత ఏడాది ఇదేకాలంలో దిగుమతులతో పోలిస్తే నాలుగురెట్లు పెరిగి 2017 మే నెలలో 103 టన్నులను దిగమతి చేసుకుంది. మే 2016లో 25.3 టన్నుల దిగుమతులను రిపోర్ట్ చేసింది. 2017సం.రంలోని మొదటి అయిదునెలలో 144 శాతం పెరుగుదలను నమోదు చేసింది. ఈ కాలానికి బంగారం దిగుమతులు 424.1 టన్నులకు చేరుకున్నాయని జిఎఫ్ఎస్ఎం తాత్కాలిక డేటా వెల్లడించింది.
ముఖ్యంగా జీఎస్టీ బిల్లు అంచనాలతో ఈ వృద్ధిని సాధించిన తాజా నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ చివరి వారంలో అక్షయ తృతియ సందర్భంగా మంచి అమ్మకాలు నమోదైనట్టు థామ్సన్ రాయిటర్స్ విభాగం జీఎఫ్ఎం సీనియర్ విశ్లేషకుడు సుధీష్ నంబియాత్ సోమవారం చెప్పారు.
ధరల తగ్గముఖం పట్టడంతో మే నెలలో పసిడి కొనుగోళ్లు పుంజుకున్నాయని కోల్తాలోని జె.జె. గోల్డ్ హౌస్ యజమాని హర్షద్ అజ్మార్ చెప్పారు. మే నెలలో రెండో వారంలో ఫ్రెంచ్ అధ్యక్ష ఎన్నికలో ఇమ్మాన్యూల్ మాక్రోన్ విజయం సాధించిన నేపథ్యంలో బంగారం ధరలు ఎనిమిది వారాల కనిష్టానికి దిగజారాయి.
మరోవైపు పుత్తడిపై జీఎస్టీ 3శాతం పన్ను రేటునిర్ణయంతో మార్కెట్లో జ్యువెల్లరీ కౌంటర్ లో డిమాండ్ పెట్టింది. ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఈ షేర్లు మెరుపులు మెరిపించింది. ముఖ్యంగా టైటన్ 17 శాతం దూసుకెళ్లగా ఇదే బాటలో పీసీ జ్యువెల్లర్స్, తార జ్యువెల్లరీ తదితర షేర్లు పయనించాయి. రెండవ అతి పెద్ద వినియోగదారుగా ఇండియా దిగుమతులు పెరగడంతో, ఆరు వారాల గరిష్ట వద్దున్న అంతర్జాతీయ ధరలకు మద్దతు ఇస్తుందని, అయితే దక్షిణాసియా దేశాల వాణిజ్య లోటును పెంచవచ్చని ఎనలిస్టుల అంచనా. కాగా పరిశ్రమల అంచనాలకు భిన్నంగా బం
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









