నిర్మాత సురేష్ వేధిస్తున్నాడని కన్నడ హీరోయిన్ అవంతిక పిటిషన్
- June 06, 2017
ఇండస్ట్రీలో మహిళా నటులకు అడుగడుగునా వేధింపులే అని గత కొంత కాలం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.. కాగా తనకు అన్యాయం జరిగింది అని... తన ప్రతిష్టకు భంగం కలిగేలా సినీ నిర్మాత వ్యవహరిస్తున్నాడని.. అందుకు తన సినీ కెరీర్ కే కాదు తన ప్రతిష్ట కు భంగం కలిగేలా ఉందని ట్విట్టర్ వేదికగా హీరోయిన్ అవంతిక గొంతు విప్పింది. వివరాల్లోకి వెళ్తే...
గ్లామర్ ఇండస్ట్రీ లో తనకు అన్యాయం జరిగిందని బుల్లి తెర నుంచి వెండి తెరపై కి వచ్చి హీరోయిన్ గా రాణిస్తున్న అవంతిక సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నది. తనను "రాజు కన్నడ మీడియం" చిత్ర ప్రొడ్యూసర్ సురేష్ పై సంచలన ఆరోపణలు చేసింది.. తనకు రాజు కన్నడ మీడియం సినిమా తొలి షెడ్యూల్ నుంచే కష్టాలు ప్రారంభం అయ్యాయని... మంచి ఫెర్ఫార్మెన్స్ ఇచ్చేందుకు చాలా కష్టపడ్డానని.. అయినా సరే షూటింగ్ సమయంలో బ్యాంకాక్ లో చాలా దారుణంగా ప్రవర్తించారని.. తెలిపింది.. అంతేకాదు తనకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయ్యాయని.. ఈ విషయంపై నిర్మాతను నిలదీసి అడగగా.. తనను వెంటనే ముంబై పంపించి... ఇప్పటి వరకూ తనకు ఇవ్వాలసిన రెమ్యూనరేషన్ ఇవ్వలేదని పేర్కొన్నది.. తనతో డబ్బింగ్ చెప్పించకుండా.. సినిమా రిలీజ్ చేయాలని నిర్మాతలు చూస్తున్నారని.. దీంతో ఈ మోసంపై కోర్టులో పిటిషన్ వేసినట్లు తెలిపింది.. ఈ ఆరోపణలతో.. ఇండస్ట్రీలో తీవ్ర దుమారం రేపుతున్నాయి. తన గురించి అవాస్తవాలను పత్రికలో నిర్మాత రాయించినట్లు ఆరోపించింది.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్‌తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్‌కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









