మ్యాక్స్‌ బాక్స్‌ ద్వారా ట్రాఫిక్‌ చలానా చెల్లింపులు

- October 11, 2015 , by Maagulf
మ్యాక్స్‌ బాక్స్‌ ద్వారా ట్రాఫిక్‌ చలానా చెల్లింపులు

డైరెక్టర్‌ ఆఫ్‌ స్మార్ట్‌ సర్వీసెస్‌ డిపార్ట్‌మెంట్స్‌ కల్నల్‌ ఖలీద్‌ నాజర్‌ అలీ రజ్‌కి ప్రెస్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ, ట్రాఫిక్‌ చలాన్లను మ్యాక్స్‌ బాక్సుల ద్వారా చెల్లించవచ్చని తెలిపారు. మ్యాక్స్‌ బాక్స్‌ల్లో క్రెడిట్‌ కార్డుల్ని స్వైప్‌ చేసి, ట్రాఫిక్‌ చలాన్ల రుసుమును చెల్లించాల్సిందిగా కోరారు. ట్రాఫిక్‌ చలాన్లను సమర్థవంతంగా సేకరించేందుకు మ్యాక్స్‌ బాక్స్‌లు ఉపయోగపడ్తాయనీ, వాహనదారులకూ ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని చెప్పారాయన. మ్యాక్స్‌ బాక్స్‌ జనరల్‌ మేనేజర్‌ రిచార్డ్‌ వైట్‌ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మ్యాక్స్‌ బాక్స్‌ మిడిల్‌ ఈస్ట్‌ సీఈఓ డాక్టర్‌ అనాస్‌ మాట్లాడుతూ, దుబాయ్‌ పోలీసులు వాహనదారుల కోసం ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపడ్తున్నారనీ, దుబాయ్‌ ఎం-గవర్నమెంట్‌లో మ్యాక్స్‌ బాక్స్‌ ఓ ముందడుగు అని ఆయన అన్నారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com