స్లొవేనియాలో ఈజీ జెట్ ఫ్లైట్‌కు ఉగ్రభయం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్... ముగ్గురి అరెస్టు
- June 10, 2017
ఈజీ జెట్ ఫ్లైట్‌లో ఉగ్రవాదులు ఉన్నట్టు తోటి ప్రయాణికులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ విమానాన్ని అత్యవసరంగా కిందికి దించేశారు. ఆదివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే... స్లొవేనియా రాజధాని లుబ్లిజానా నుంచి లండన్ కు 151 మంది ప్రయాణికులతో ఈజీ జెట్ ఫ్లైట్ ఒకటి బయలుదేరింది. ఈ విమానం బయలుదేరిన కొద్దిసేపటికే విమానంలో కొందరు ఉగ్రవాదులు ఉన్నారని, వారంతా ఉగ్రకార్యకలాపాలకు సంబంధించి చర్చలు జరుపుకుంటున్నారని కొంతమంది ప్రయాణికులు విమానం సిబ్బంది చెవిలో ఊదారు. ఈ సమాచారాన్ని పైలట్లకు చేరవేయగా, వారు ఏటీసీకి చేరవేశారు. దీంతో విమానాన్ని జనసంచారం అంతగా ఉండని కొలోంగ్లోని బాన్ విమానాశ్రయంలో అత్యవసరంగా దించి, ప్రయాణికులను అత్యవసర ద్వారం గుండా బయటకు పంపారు. ఆపై ముగ్గురిని అరెస్ట్ చేసి, వారి బ్యాక్‌ప్యాక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ బ్యాక్‌ప్యాక్‌లో ఏమైనా అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా? అన్న విషయం తెలియరాలేదు. వీరు ఎవరు? విమానంలో ఏం మాట్లాడుకున్నారన్న విషయమై అధికారులు విచారణ జరుపుతున్నారు. కాగా, ఈ ఘటనతో యూరప్‌లో గత రాత్రి 7 నుంచి 10 గంటల మధ్య 10 విమానాలను దారి మళ్లించగా, 20 విమానాల ప్రయాణం ఆలస్యమైంది.
తాజా వార్తలు
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్‌లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..
- ఆపిల్ కు కొత్త సీఈఓ జాన్ టెర్నస్
- హోర్ముజ్ జలసంధి పై ఇరాన్ పట్టు: గల్ఫ్ దేశాల ఆందోళనలు









