ఖిమ్జి రామ్దాస్ ఉద్యోగులకు వారి కుటుంబాలకు రమదాన్ వార్షిక ఇఫ్తార్ విందు
- June 11, 2017
మస్కట్: ఖిమ్జి రామ్దాస్ తన నిర్వహణ ,సిబ్బంది మరియు వారి కుటుంబాల సభ్యుల కోసం వార్షిక రమాదాన్ వార్షిక ఇఫ్తార్ విందును ఇటీవల నిర్వహించారు. 1,200 మందికి పైగా ఖిమ్జి రామ్దాస్ ఉద్యోగులు, డైరెక్టర్లు మరియు సీనియర్ మేనేజ్మెంట్ ఉద్యోగులు వారి కుటుంబాలతో కలిసి షెరటాన్ ఓమన్ హోటల్ వద్ద సమావేశమయ్యాయి, ఈ సాంప్రదాయం ద్వారా ఒకరితో ఒకరు ఐక్యత, స్నేహం మరియు కుటుంబాల సహవాసంకు ఇదో చిహ్నంగా ఉంది. ప్రతి సంవత్సరం ఈ ఇఫ్తార్ కార్యక్రమం ద్వారా ఉద్యోగులను కేవలం ఓ విలువైన ఆస్తులుగా కాక బాంధవ్యాలను బలపర్చుకొనే విధానంగా పునరుద్ఘాటించే అవకాశాన్ని అందిస్తుంది.ఈ సందర్భంగా డైరక్టర్ నైల్ష్ ఖిమ్జీ మాట్లాడుతూ, "ఖిమ్జి రామ్దాస్ కు సంబంధించి మేము మా ఉద్యోగులను విలువైన ఆస్తులను మాత్రమే కాకుండా మా సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా వారిని పరిగణిస్తాం. రమదాన్ పవిత్ర నెలలో సందర్భంగా ఇఫ్తార్ విందు ద్వారా ఖిమ్జి రామ్దాస్ ఉద్యోగుల కుటుంబాలతో కలిపి మేము సాంప్రదాయిక విలువలను పెంపొందించుకొనేందుకు ఈ కార్యక్రమం జరుపుకుంటారు. ఖిమ్జి రామ్దాస్ ఉద్యోగులు కార్మికులకు శ్రద్ధ వహించడమే కాకుండా వారి కుటుంబాలకు చెందిన సభ్యుల పట్ల కనబర్చే శ్రద్ధాసక్తులు మా వాస్తవమైన నిబద్ధతకు నిదర్శనం అని అన్నారు. ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి ఎష్రాఖా బ్రాండ్ అంబాసిడర్ తో పాటు ఖిమ్జి రామ్దాస్ యొక్క సాంఘిక అభివృద్ధి విభాగానికి వారు సందర్భంగా హాజరయ్యారు.
తాజా వార్తలు
- సౌదీలో భారీ డ్రగ్స్ స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- ఒమన్‌లో టూరిజం, హాస్పిటాలిటీ ఉద్యోగులకు శుభవార్త..!!
- విరమణ పొందిన ఏడుగురు పోలీసు అధికారులకు ఘన వీడ్కోలు.. సేవలను కొనియాడిన సైబరాబాద్ సీపీ డా. రమేష్
- డ్రైవింగ్ లైసెన్స్ దరఖాస్తుదారులకు అలర్ట్.. ఆర్టీఓ కొత్త రూల్స్..
- శ్రీవారి బ్రహ్మోత్సవాలకు టీటీడీ భారీ ఏర్పాట్లు
- ప్రధాని మోదీ పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- భోగాపురం ఎయిర్పోర్ట్ ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
- తెలంగాణలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం: సీఎం రేవంత్
- సాంకేతికతతో భవిష్యత్ పోలీసింగ్‌కు పోలీసులు సిద్ధం కావాలి: డీజీపీ సీవీ ఆనంద్
- కేంద్రం కొత్త రూల్స్.. వాహనానికి, ఆధార్ కి లింక్..







