ఖ్ఆతిఫ్ లో సైనికుని పై కాల్పులు జరిగిన ఆగంతకులు

- June 16, 2017 , by Maagulf
ఖ్ఆతిఫ్ లో సైనికుని పై కాల్పులు జరిగిన ఆగంతకులు

 గుర్తు తెలియని వ్యక్తులు ఒక సైనికునిపై కాల్పులు జరపడంతో  ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఖ్ఆతిఫ్ గవర్నరేట్ పరిధిలోమంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకొందని అంతర్గత వ్యవహారాల శాఖ యొక్క భద్రతా ప్రతినిధి చెప్పారు. వాలిద్ బిన్ బ్రిక్  బిన్ మాబ్రయోక్  అల్ హ్యూజైల్ అనే సైనికుడు ఆఓడ్ స్ట్రీట్ లో తన క్షేత్రస్థాయి భద్రతా గస్తీ కార్యక్రమాలను నిర్వహిస్తుండగా ఆయనపై ఎవరో ఆగంతకులు కాల్పులు జరిపారు. వెంటనే ఆ సైనికుడిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి స్థిరంగా ఉంది. సెక్యూరిటీ అధికారులు ఈ కాల్పులు జరిపింది తీవ్రవాద దుశ్చర్యగా ఈ కేసుని భావించి క్షుణంగా పరిశోధిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com