'కాదలి' రివ్యూ

- June 16, 2017 , by Maagulf
'కాదలి' రివ్యూ

పూజా కె.దోషి, హరీష్‌ కల్యాణ్‌, సాయి రోనక్‌, సుదర్శన్‌ తదితరులు..
పట్టాభి ఆర్‌. చిలుకూరి
ప్రసన్‌.. ప్రవీణ్‌.. శ్యామ్‌

ఈ మధ్య చిన్న సినిమా , పెద్ద సినిమా అని తేడా లేకుండా ప్రమోషన్స్ తో తమ సినిమాల ఫై క్రేజ్ తేవడమే పనిగా పెట్టుకున్నారు ఆయా చిత్ర యూనిట్. ఇక ఆ ప్రమోషన్స్ చూసి సినిమా ఓ రేంజ్ లో ఉంటుందని అంత థియేటర్స్ కు పరుగులు పెడుతున్నారు.. చిన్న సినిమా గా మొదలై , పెద్ద సినిమా లెవల్లో క్రేజ్ తెచ్చుకున్న మూవీ కాదలి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఆడియో జరుపుకోవడం తో ఈ సినిమా కు బాగా క్రేజ్ వచ్చింది..దానికి తగట్టే సినిమా ప్రోమోట్ చేసి ఈరోజు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి సినిమా ఎలా ఉంది..? అసలు కథ ఏంటి..అనేది ఇప్పుడు చూద్దాం..
బాంధవి (పూజా కె.దోషి) ఓ డాక్టర్‌.వృత్తి రీత్యా సెటిల్ కావడం తో ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తారు..కానీ ఏ పెళ్లి సంబంధం కూడా వర్క్ అవుట్ కాదు..అన్ని పెళ్లి చూపుల దగ్గరే ఆగిపోతాయి. దీంతో తన సన్నిహితుల దగ్గర చెప్పుకొని బాధపడుతుంటుంది. ఇలా పెళ్లి చూపులు వర్క్ అవుట్ అవ్వవు కానీ మంచి అతడిని చూసి ప్రేమించి పెళ్లి చేసుకొమ్మని ఫ్రెండ్స్ సలహా ఇస్తారు..
కార్తీక్‌ (హరీష్‌ కల్యాణ్‌) అనే అతడిని చూసి ఇష్టపడుతుంది..ఇద్దరు ప్రేమలో మునిగిపోతారు..కానీ కార్తీక్‌ది ఓ విభిన్నమైన మనస్తత్వం. కోపం వచ్చినా.. సంతోషం వచ్చినా ఇంట్లోంచి వెళ్లిపోతాడు. ఓ రోజు అలాగే కార్తీక్ ఇంట్లోనుండి వెళ్లిపోయేసరికి.. క్రాంతి (సాయి రోనక్‌) అనే మరో అబ్బాయిని ఇష్టపడుతుంది. ఇతడికి కోపం ఎక్కువ..చిన్న చిన్న విషయాలకు సైతం తన కోపం చూపిస్తుంటాడు. బాంధవి తో ప్రేమ మొదలయ్యాక ఆ కోపం కాస్త తగ్గుతుంది..ఈ లోపు ముందుగా ప్రేమించిన కార్తీక్‌ వస్తాడు..ఆ తర్వాత ఏం జరుగుతుంది..? బాంధవి ఎవర్ని పెళ్లి చేసుకుంటుంది..? చివరకు ఏమవుతుంది..? అనేది మీరు తెర ఫై చూడాల్సిందే.
* హీరో - హీరోయిన్స్ మధ్య కొన్ని సన్నివేశాలు
* మ్యూజిక్
* కథ
* కథనం
సినిమా అంత హీరోయిన్ పూజా కె.దోషి చుట్టే సాగడం తో కథలో ఆమె హైలైట్ అయ్యింది..ఆమె రోల్ కు న్యాయం చేసిందని చెప్పాలి. కాకపోతే డబ్బింగ్ కు ఆమెకు లిప్ సింక్ సెట్ కాలేదు. హీరోలైన హరీష్‌ కల్యాణ్‌, సాయి రోనక్‌ బాగా నటించారు. హీరో సాయి రోనక్ డబ్బున్న అబ్బాయి పాత్రకి బాగా సూటయ్యాడు. అలాగే అతని పాత్రలో వున్న కాస్త నెగెటివ్ స్వభావాన్ని కూడా తన నటన ద్వారా బాగానే ఎలివేట్ చేశాడు.
* సుదర్శన్‌ కామెడీ పర్వాలేదు అనిపించింది.మిగిలిన నటి నటుల రోల్స్ పెద్దగా ఏమి లేవు.
* ప్రసన్‌.. ప్రవీణ్‌.. శ్యామ్‌ సంగీతం సినిమా కు హైలైట్ గా నిలిచింది..బ్యాక్ గ్రౌండ్ కూడా ఆకట్టుకుంది. కథ కు తగిన ఖర్చు చేసి నిర్మాత సేఫ్ అయ్యాడు. అందమైన లొకేషన్స్ తో సినిమా ని అందంగా చూపించారు. డైరెక్టర్ పట్టాభి విషయానికి వస్తే ప్రస్తుతం యూత్ ను మైండ్ లో పెట్టుకొని కథ రాసాడు కానీ దానిని తెరకెక్కించడం లో విఫలం అయ్యాడు. ఫస్ట్ హాఫ్ అంత సాదా సీదాగా నడిపించాడు.సినిమాలో కొత్తదనం గాని ఎన్నడూ చూడలేని సన్నివేశాలు కానీ ఏమీలేవు..ప్రేక్షకులు కొంతకాలంగా చూస్తున్న ప్రేమ కథనే మరోసారి ప్రేక్షకుల ముందుకు అందించాడు.
ఇద్దరి ప్రేమికుల్లో ఎవరిని పెళ్లి చేసుకోవాలోతెలియక అయోమయం లో పడే యువతీ కథనే ఈ కాదలి. ఇప్పటికే ఇలాంటి కథలు తెలుగు లో చాల వచ్చాయి..కొత్త ట్విస్ట్ లు , మలుపు తిప్పే సన్నివేశాలు కానీ ఏమి లేవు..ఫస్ట్ హాఫ్ అంత నెమ్మదిగా నడుస్తుంది. సెకండ్ హాఫ్ అయితే అసలు చెప్పడానికి ఏం లేదు. డైలాగ్స్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. ఓవరాల్ గా కాదలి లో కథలేదని తేలిపోయింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com