ఇక పై బ్యాంకు ఖాతాలకు ఆధార్ తప్పనిసరి
- June 16, 2017
కేంద్రం మరో కీలక నిర్ణయం
ఆధార్ విషయంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా బ్యాంకు ఖాతా తెరిచే వారికి ఆధార్‌ను తప్పనిసరి చేసింది. దీంతో పాటు రూ.50వేలు ఆపై లావాదేవీలకు కూడా ఆధార్‌ను తప్పనిసరిగా సమర్పించాలని పేర్కొంది.
దీంతో పాటు ఇప్పటికే బ్యాంకు ఖాతా కలిగిన వారికి ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గడువు విధించింది. ఆలోగా బ్యాంకు ఖాతాకు ఆధార్‌ను జత చేయకపోతే వాటిని చెల్లనివిగా గుర్తిస్తారు. ఈ మేరకు రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, పాన్ కార్డుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేసేందుకు కేంద్రం ఇప్పటికే పాన్‌కార్డుకు ఆధార్‌ను తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఒకటికి మించి పాన్ కార్డులను కొందరు వినియోగిస్తుండడాన్ని గుర్తించి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
తాజా వార్తలు
- ఏపీ భక్తులకు గుడ్ న్యూస్.. దేవీ నవరాత్రులకు ఉచిత విద్యుత్: మంత్రి లోకేష్
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం
- ఉక్రెయిన్‌లో బస్సుల పై దాడి.. 33 మంది దుర్మరణం
- UAE Pavilion draws strong visitor turnout on opening day of Marrakech Airshow 2026
- విమాన ప్రయాణికులకు మరో షాక్.. ఛార్జీలు పెంచిన ఎయిరిండియా
- సంగీతం మరియు నృత్యం ద్వారాకంటి వెలుగు
- అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
- ఆటిజం పై అపోహలు వీడాలి: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- సౌదీలో ఉద్రిక్తతలు.. రియాద్‌కు ఇండిగో, ఎయిరిండియా విమాన సర్వీసులు రద్దు
- శ్రీవారి భక్తుల కోసం ‘గరుడ’ యాప్







