యూఏఈలో తయారైన తొలి కారు ఫ్రాన్స్‌కి తరలింపు

- June 17, 2017 , by Maagulf
యూఏఈలో తయారైన తొలి కారు ఫ్రాన్స్‌కి తరలింపు

యూఏఈలో తయారైన తొలి కారుని ఎమిరేట్స్‌కి చెందిన ఫ్రైట్‌ డివిజన్‌ ఎమిరేట్స్‌ స్కూ కార్గో ద్వారా ఫ్రాన్స్‌కి తరలించారు. ప్రతిష్టాత్మకమైన '24 అవర్స్‌ ఆఫ్‌ లెమాన్స్‌' ఎండ్యురన్స్‌ రేస్‌లో ఈ కారుని ప్రదర్శిస్తారు. యూఏఈలో జన్నరెల్లి ఆటోమోటివ్‌ - ఈక్వేషన్‌ కాంపోజిట్స్‌ఎల్‌ఎల్‌సితో కలిసి 'డిజైన్‌-1' అనే స్పోర్ట్స్‌ కారుని తయారు చేయడం జరిగింది. కార్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ లైసెన్స్‌ కలిగిన తొలి కంపెనీ ఇది. 1960 నాటి క్లాసిక్‌ కార్స్‌ ప్రేరణతో దీన్ని రూపొందించారు. ఈ కారు 70,000 డాలర్ల నుంచి 90,000 డాలర్ల వరకు ధర పలకనుంది. స్కై కార్గో, ప్రోడెక్స్‌ వరల్డ్‌ వైడ్‌తో కలిసి లాజిస్టిక్స్‌, వేర్‌హౌసింగ్‌ సర్వీస్‌ని నిర్వహిస్తోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com