23 వాహనాల సీజ్‌, 9 మంది అరెస్ట్‌

- June 17, 2017 , by Maagulf
23 వాహనాల సీజ్‌, 9 మంది అరెస్ట్‌

షార్జా పోలీసులు 23 వాహనాల్ని సీజ్‌ చేయడంతోపాటుగా తొమ్మిది మంది మోటరిస్టుల్ని అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేసినవారిని పబ్లిక్‌ ప్రాసిక్యూషన్‌కి రిఫర్‌ చేయడం జరిగింది. ప్రమాదకరమైన రీతిలో మోటరిస్టులు వ్యవహరించారనే అభియోగాల్ని ఎదుర్కొంటున్నారు. షార్జా పోలీస్‌ డిప్యూటీ కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ బ్రిగేడియర్‌ అబ్దుల్లా ముబారక్‌ బిన్‌ అమీర్‌ మాట్లాడుతూ, ట్రాఫిక్‌ మరియు లైసెన్స్‌ డిపార్ట్‌మెంట్‌తో కలిసి 'అల్‌ ఫజర్‌ డిటెక్టర్‌' పేరుతో నిర్వహించిన ఆపరేషన్‌లో 23 వాహనాల్ని సీజ్‌ చేసి, ప్రమాదకర రీతిలో విన్యాసాలు చేస్తున్న 9 మందిని అరెస్ట్‌ చేయడం జరిగిందన్నారు. అతి వేగంతో వాహనాలు నడపడమే కాకుండా, రోడ్లపై స్టంట్స్‌ చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలకు ముప్పుతెచ్చేలా వ్యవహరించినవారిని గుర్తించి అరెస్ట్‌ చేశామని బ్రిగేడియర్‌ అబ్దుల్లా ముబారక్‌ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్‌ నిబంధనలు అనుసరించి వాహనాలు నడపాలని, రోడ్‌ సేఫ్టీ అతి ముఖ్యమని ఆయన చెప్పారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com