ఎంఐఎ 'గరాంగో' సెలబ్రేషన్స్‌కి విశేష ఆదరణ

- June 17, 2017 , by Maagulf
ఎంఐఎ 'గరాంగో' సెలబ్రేషన్స్‌కి విశేష ఆదరణ

మ్యూజియమ్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ ఆర్ట్‌ (ఎంఐఎ) గతవారం నిర్వహించిన గరాంగో ఫెస్టివల్‌కి విశేషమైన ఆదరణ లభించింది. ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో పిల్లలతోపాటు, కుటుంబాలు హాజరయ్యాయి. గరాంగో సంప్రదాయ చిల్డ్రన్స్‌ ఫెస్టివల్‌. రమదాన్‌ 14వ రోజు ఫాస్టింగ్‌ ముగిసిన తర్వాత ఈ వేడుకను నిర్వహిస్తారు. సంప్రదాయ పద్ధతులను తెలియజేయడం, స్టోరీ టెల్లింగ్‌, బహుమతుల అందజేత వంటి కార్యక్రమాలు ఇందులో ఉంటాయి. పవిత్ర రమదాన్‌ సందర్భంగా ఎంఐఎ పలు ప్రత్యేక కార్యక్రమాలు చేపడ్తోంది. లెక్చర్స్‌, లాంతర్న్‌ మేకింగ్‌, వీవింగ్‌ రగ్స్‌ వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com