23 వాహనాల సీజ్, 9 మంది అరెస్ట్
- June 17, 2017
షార్జా పోలీసులు 23 వాహనాల్ని సీజ్ చేయడంతోపాటుగా తొమ్మిది మంది మోటరిస్టుల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసినవారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్‌కి రిఫర్ చేయడం జరిగింది. ప్రమాదకరమైన రీతిలో మోటరిస్టులు వ్యవహరించారనే అభియోగాల్ని ఎదుర్కొంటున్నారు. షార్జా పోలీస్ డిప్యూటీ కమాండర్ ఇన్ చీఫ్ బ్రిగేడియర్ అబ్దుల్లా ముబారక్ బిన్ అమీర్ మాట్లాడుతూ, ట్రాఫిక్ మరియు లైసెన్స్ డిపార్ట్మెంట్తో కలిసి 'అల్ ఫజర్ డిటెక్టర్' పేరుతో నిర్వహించిన ఆపరేషన్‌లో 23 వాహనాల్ని సీజ్ చేసి, ప్రమాదకర రీతిలో విన్యాసాలు చేస్తున్న 9 మందిని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. అతి వేగంతో వాహనాలు నడపడమే కాకుండా, రోడ్లపై స్టంట్స్ చేయడం ద్వారా ఇతరుల ప్రాణాలకు ముప్పుతెచ్చేలా వ్యవహరించినవారిని గుర్తించి అరెస్ట్ చేశామని బ్రిగేడియర్ అబ్దుల్లా ముబారక్ తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు అనుసరించి వాహనాలు నడపాలని, రోడ్ సేఫ్టీ అతి ముఖ్యమని ఆయన చెప్పారు.
తాజా వార్తలు
- తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
- భారతీయ పారిశ్రామికవేత్తలతో ట్రంప్ సమావేశం
- మీ డ్రైవింగ్ లైసెన్స్‌లో మొబైల్ నంబర్‌ను ఆన్లైన్లో ఎలా మార్చాలో తెలుసా?
- పెట్టుబడులకు ఏపీకి మించిన రాష్ట్రం లేదు..దావోస్‌లో సీఎం చంద్రబాబు
- ఇంటి నుంచే FIR? తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం
- రియాద్ సీజన్.. 14 మిలియన్లు దాటిన విజిటర్స్..!!
- షార్జాలో పెట్రోల్ స్టేషన్లపై పోలీసుల నిఘా..!!
- ఇండియా నుంచి చేపల దిగుమతికి అనుతించండి..!!
- ఖలీఫా బ్రిడ్జిపై ట్రక్ నిషేధం పొడిగింపు..ట్రాఫిక్ అథారిటీ క్లారిటీ..!!
- కేరళ పౌల్ట్రీ దిగుమతుల పై ఒమన్ నిషేధం..!!







