ప్రముఖ తమిళచిత్ర నిర్మాత కన్నుమూత!
- June 17, 2017
తమిళచిత్ర నిర్మాత జైన్‌రాజ్ శనివారం కన్నుమూశారు. చెన్నైకి చెందిన జైన్‌రాజ్ పలు చిత్రాలను నిర్మించారు. ఎన్నో సినిమాలకు డిస్టిబ్యూటర్‌గా వ్యవహరించారు. అర్జున్-రజిత జంటగా ఆయన ‘జైహింద్’ సినిమాను తెరకెక్కించారు. రాజమౌళి దర్శకత్వం వహించిన బాహుబలిను తమిళంలో పంపిణీ చేశారు. అదేవిధంగా సంతానం హీరోగా నటించిన దిల్లుక్కు దుడ్డు, జయం రవి కథానాయకుడిగా నటించిన సకలకళావల్లవన్, విజయ్ సేతుపతి నటించిన ఆండవన్‌కట్టళై చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు.
అనేక చిత్రాలకు ఫైనాన్సియర్‌గా వ్యవహరించారు. స్థానిక ఆల్వార్‌పేటలో నివసిస్తున్న జైన్‌రాజ్ శనివారం అనారోగ్యంతో కన్నుమూశారు. జైన్‌రాజ్ భౌతిక కాయానికి నటుడు విక్రమ్‌ప్రభు, నిర్మాత టి.శివ, కేఎస్.శ్రీనివాసన్, హెచ్. మురళి పలువురు సినీ ప్రముఖులు నివాళులర్పించారు. జైన్‌రాజ్ పార్థివ దేహానికి శనివారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
తాజా వార్తలు
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC
- అటల్ పెన్షన్ యోజనకు గ్రీన్ సిగ్నల్!
- సెయింట్ లూయిస్‌లో NATS ఉచిత వైద్య శిబిరం
- మళ్లీ దుందుడుకు చర్యలకు పాల్పడ్డ పాకిస్థాన్..
- ప్రపంచ దేశాల సహకారంతోనే ఉగ్రవాదం పై విజయం: మంత్రి జైశంకర్
- సౌదీ అరేబియాలో 'స్పియర్స్ ఆఫ్ విక్టరీ 2026' ప్రారంభం..!!
- ఇండియాకు డబ్బు పంపడానికి ఇదే సరైన సమయమా?
- 8 రోజుల్లో 28వేలకు పైగా ట్రాఫిక్ ఉల్లంఘనలు నమోదు..!!
- UNRWAకు మద్దతు కొనసాగుతుంది: ఖతార్
- రెసిడెన్సీ చెల్లుబాటుకు ఎక్స్ పాట్ ఐడి కార్డు లింక్..!!







