పొగరుబోతు పోలీస్ అధికారికి మూడు సంవత్సరాల జైలుశిక్ష
- June 17, 2017
గల్ఫ్ దేశాల సమాఖ్యకు చెందిన ఒక పౌరుని పట్ల దురుసుగా ప్రవర్తించడమే కాక ఆ వ్యక్తి పై దాడికి పాల్పడి గాయపరిచిన నేరానికి ట్రాఫిక్ డైరెక్టరేట్ లో పనిచేస్తున్న ఓ పోలీసు అధికారి పొగరుకు తగిన బహుమతి లభించింది. మూడు సంవత్సరాలపాటు కటకటాల వెనుక ఉండాలంటూ హై క్రిమినల్ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కోర్టు నివేదిక ప్రకారం,ఈ సంఘటన గత ఏడాది తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో మనామ హోటల్ లో జరిగింది, అక్కడ ప్రతివాది బార్ లో కూర్చొని ఒక బీరును తాగుతున్నాడు. ఆ క్షణాన అక్కడకు వచ్చిన పోలీసు అధికారికి జిసిసి పౌరుని మధ్య ఒక వివాదం జరిగింది. " మా డబ్బుతో మేము మిమ్మల్ని తీసుకొస్తాం ..అలాగే మిమ్ముల్ని కొనుగోలు చేస్తాం " అని గల్ఫ్ దేశాల సమాఖ్యకు చెందిన పౌరుడు తనతో వాదనకు తెర తీసేడని పోలీసు అధికారి న్యాయస్థానానికి తెలిపాడు. అనంతరం జిసిసి వ్యక్తి కొద్దిసేపటికి టాయిలెట్ లోనికి ప్రవేశించగానే ఆ నిందిత పోలీస్ అధికారి బాధితుడిని అనుసరించాడు. జిసిసి పౌరుడిని గోడ వైపునకు బలంగా నెట్టివేశాడు మరియు ఆ వ్యక్తి తలపై పిడి గుద్దులు విసరడమే కాక, బాధితుని ముక్కును విరగకొట్టాడు. దీనితో ఆ పోలీస్ ఆధికారిపై కేసు నమోదైంది.ఆ తర్వాత అరెస్టు కాబడిన ఆ పోలీస్ అధికారి తన నేరాన్ని న్యాయస్థానం ముందు అంగీకరించాడు.
తాజా వార్తలు
- ట్రంప్ పిలుపునకు స్పందించిన అరబ్ మరియు ఇస్లామిక్ దేశాలు..!!
- గ్యాస్ లీకేజీల వల్ల ప్రాణాంతక ప్రమాదాలు.. అలెర్ట్ జారీ..!!
- అల్ బషాయర్ క్యామెల్ రేసింగ్ ఫెస్టివల్ ఫిబ్రవరి 2న ప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో SR300 బిలియన్లు ఖర్చు పెట్టిన టూరిస్టులు..!!
- ఈ వీకెండ్ లో అరేబియన్ గల్ఫ్ స్ట్రీట్ పూర్తిగా మూసివేత ..!!
- షార్జాలో రెస్టారెంట్ లోకి దూసుకెళ్లిన టాక్సీ..!!
- న్యూజిలాండ్ పై టీమిండియా ఘన విజయం
- ఈనెల 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’
- పార్టీలకు, నేతలకు వెంకయ్య నాయుడు సూచన
- బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అభ్యర్థనను తోసిపుచ్చిన ICC







