హాకీలో కెనడాపై భారత్‌ గెలుపు

- June 17, 2017 , by Maagulf
హాకీలో కెనడాపై భారత్‌ గెలుపు

హాకీ వరల్డ్‌ లీగ్‌ సెమీఫైనల్‌ టోర్నీలో భారత జోరు కొనసాగుతోంది. పూల్‌-బిలో శనివారం జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 3-0తో కెనడాను మట్టికరిపించి వరుసగా రెండో విజయం సాధించింది. ఎస్‌వీ సునీల్‌ (5వ నిమిషం), ఆకా్‌షదీప్‌ సింగ్‌ (10వ), సర్దార్‌ సింగ్‌ (18వ) ఫీల్డ్‌ గోల్స్‌తో కెనడాను బెంబేలెత్తించారు. ఈ గెలుపుతో టీమిండియా క్వార్టర్స్‌ బెర్త్‌ దాదాపుగా ఖరారైనట్టే. అయితే పెనాల్టీ కార్నర్లను గోల్స్‌గా మలచడంలో భారత జట్టు వైఫల్యం మాత్రం కోచ్‌ను కంగారుపెడుతోంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com