బహ్రెయిన్‌ని వీడండి: ఖతార్‌ సైనికులకి ఆదేశం

- June 19, 2017 , by Maagulf
బహ్రెయిన్‌ని వీడండి: ఖతార్‌ సైనికులకి ఆదేశం

మనామా: ఖతార్‌ సైనికులు 48 గంటల్లోగా దేశం విడిచి వెళ్ళిపోవాల్సిందిగా బహ్రెయిన్‌ ఆదేశించింది. బహ్రెయిన్‌లో అమెరికన్‌ బేస్‌ ఉంది. సెంట్రల్‌ కమాండ్‌ ఆఫ్‌ ది నావల్‌ ఫోర్సెస్‌ని బహ్రెయిన్‌లో అమెరికా నిర్వహిస్తోంది. ఈ బేస్‌లో జిసిసి దేశాలకు చెందిన పలువురు సైనికులు పనిచేస్తున్నారు. రీజియన్‌లో తీవ్రవాద కార్యకలాపాలపై ఈ బేస్‌ నుంచి పోరాటం జరుగుతుంటుంది. ఈ బేస్‌లోనే వివిధ దేశాలకు చెందిన సైనికులతోపాటు ఖతార్‌ సైనికులు కూడా ఉన్నారు. అయితే ఖతార్‌తో జిసిసికి చెందిన కొన్ని దేశాలు తెగతెంపులు చేసుకున్న దరిమిలా, బహ్రెయిన్‌ తమ భూ భాగం నుంచి ఖతార్‌ సైనికులు వెళ్ళిపోవాలని కోరుతోంది. ఈ మేరకు బహ్రెయిన్‌లోని యూఎస్‌ బేస్‌ కమాండర్‌ ఇన్‌ఛార్జ్‌కి బహ్రెయిన్‌ లేఖ రాసింది. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com